Pawan Kalyan Hobbie: పవన్ కళ్యాణ్ దాదాపు పది సంవత్సరాల పాటు ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు…శృతిహాసన్ తో ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ అయి అందరినీ ఖుషి చేసింది. ఇక అప్పటినుంచి వీరిద్దరి జంట సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కొద్దిరోజుల తరువాత కలిసి చేసిన కాటమరాయుడు..వకీల్ సాబ్ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. అందుకే చాలామంది పవన్ అభిమానులకి శృతిహాసన్ ఫేవరెట్ హీరోయిన్ గా కూడా మారింది. ఈ నేపథ్యంలో శృతిహాసన్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్.. పవన్ కి సంబంధించిన ఓ అలవాటు గురించి చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శృతిహాసన్, సాయి ధరమ్ తేజ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, శ్రియారెడ్డి, నిర్మాత శోభు యార్లగడ్డ.. కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ శృతిహాసన్.. “పవన్ కళ్యాణ్ కి లెగో బొమ్మలతో ఆడుకునే అలవాటు ఉందని ఎవరూ అనుకోరు” అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు..
కాగా పక్కనే ఉన్న సాయి ధరమ్ తేజ్ ఇదే విషయం గురించి మాట్లాడుతూ..’మా చిన్నప్పుడు ఆయన మా అందరితో కలిసి లెగోస్ ఆడుకునేవారు. నిజానికి ఆయనే మా అందరిని ఆడుకుందాం రా అని పిలిచేవారు. నేనెప్పుడైనా లెగోస్ కొనుకుంటే.. ఆయనికి ఓ సెట్ తీసుకుంటా. మా అమ్మ కూడా ఆయన బర్త్ డేకి ఆయనకి లెగోస్ కొనుకోమని డబ్బులు బహుమతిగా ఇచ్చేది. ఆ విషయం నాకు బాగా గుర్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా పవన్ కళ్యాణ్ కూడా తనకు ఈ అలవాటు ఉందని చాలాసార్లు చెప్పకచ్చాడు. అవి ఆడడం ఇంటరెస్టింగ్ ఉండేదని పలు వేదికల పై బహిరంగంగా చెప్పారు. చిరంజీవి కూడా ఫారిన్ కంట్రీస్ కి షూటింగ్ కి వెళ్ళినప్పుడు.. అక్కడి నుంచి రామ్ చరణ్‌కి, ఇంటిలో ఇతర పిల్లలకి బొమ్మలు తెచ్చేవారట... అప్పుడు పవన్ కి లెగోస్ తీసుకు వచ్చేవారని.. చిరంజీవే స్వయంగా చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు.. హరీష్ శంకర్ తో ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. అయితే సుజిత్ తో చేస్తున్న ఓజీ చిత్రం మాత్రం త్వరలోనే షూటింగ్ ముగించుకొని రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.
Also read: PPF Benefits: నెలకు 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి 26 లక్షలు పొందే అద్భుత పధకం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook