Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ

Petrol And Oil Tankers Owners Called Off Strike: వాహనదారులకు గుడ్‌న్యూస్. ఆయిల్ ట్యాంకర్లు ధర్నాను విరమించారు. ధర్నా నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంక్‌లకు క్యూ కట్టగా.. ధర్నా విరమణతో ఉపశమనం కలిగింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2024, 04:50 PM IST
Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ

Petrol And Oil Tankers Owners Called Off Strike: మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన సమ్మెను విరమించారు. మంగళవారం ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్దఎత్తున బారులు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. 

హిట్ అండ్ రన్ కేసులో రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను డిమాండ్ ట్రక్కు, ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావంతో ఇప్పటికే బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఈ మూడు రోజుల సమ్మె నేపథ్యంలో రేపు కూడా బంకుల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చని వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. సమ్మెను విరమించడంతో వాహనదారులు ఊరట చెందుతున్నారు.

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News