Thati Kallu Benefits: డయాబెటిస్ ఉన్నవారు తాటికల్లు తాగుతే?

Kallu Good Or Bad For Health: తాటి కల్లు, తాటి ముంజలు అంటే తెలియని వారు ఉండరు. ఈ తాటి చెట్టు నుంచి వచ్చే కల్లుని పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు తాగుతూ ఉంటారు. దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో తాటి కల్లు తీసుకోవడం మంచిదేనా..కాదా అనే అపోహలు కలుగుతుంది. అయితే తాటి కల్లు మంచిదేనా ? దీనిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుందా?     అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 10:46 PM IST
Thati Kallu Benefits: డయాబెటిస్ ఉన్నవారు తాటికల్లు తాగుతే?

Kallu Good Or Bad For Health: తాటి కల్లు అనేది తాటి చెట్టు నుంచి వస్తుంది. ఇది చూడానికి తెల్లటి నీరులాగా ఉంటుంది. ఈ నీరు చెట్టు నుంచి వచ్చే వంద ఎమ్‌ఎల్‌ నీరులో 75 క్యాల‌రీల శ‌క్తి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్స్‌ సుక్రోజ్‌ గుణాలు ఉంటాయి. ఈ గుణాలు వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉంటాయి.

అంతేకాకుండా తాటి కల్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ కల్లును  12 గంట‌ల లోపు తీసుకోవాలి. ఎందుకంటే క‌ల్లు పులిసే కొద్ది దీనిలో ఉండే ఈస్ట్ కార‌ణంగా ఆల్క‌హాల్ శాతం కూడా పెరుగుతుంది.అలాగే పులిసిపోతుంది. పులిసిన క‌ల్లును తీసుకోవ‌డం వ‌ల్ల  ఆరోగ్యానికి హాని క‌లుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Vitamin B12 Side effects: విటమిన్ B12 ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే..

పులిసిన కల్లు తాగడం వల్ల రోగనిరోధ‌క శ‌క్తి, కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. పులిసిన కల్లు మత్తును కలిగిస్తుంది. ఈ పులిసిన కల్లులో ఆల్కహాల్‌ శాతం పెరుగుతుంది. దీని కారణంగా ఆల్కహాల్‌ వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడుతాం. కాబట్టి చెట్టు నుంచి తీసిన కల్లును తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 

Also Read: Hair Fall Reasons: జుట్టు రాలడానికి గల కారణాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News