Amla And Aloe Vera Juice Benefits: ఉసిరికాయ ఆరోగ్యనికి ఏంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి , ఐరన్ ఇతర విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే అలోవెరాలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తాం. అయితే ఆరోగ్యనిపుణులు ప్రకారం ఉసిరికాయను అలోవెరాలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఉసిరికాయ, అలోవెరా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
→ ఉసిరికాయ, అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలుగుతాయి.
→ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పెరగడం వల్ల శరీరంలో వచ్చే మంటలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
→ అంతేకాకుండా డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఉసిరి, అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అదుపు చేస్తుంది.
→ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఈ ఉసిరి అలోవెరా జ్యూస్ సహాయపడుతుంది.
→ గ్యాస్ట్రిక్, మెటాస్టాసిస్ వంటి వ్యాధులను నిరోధిచడంలో అలోవెరా, ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.
Also read: Turmeric Milk Benefits: శీతాకాలంలో పసుపును పాలలో కలుపుకొని తాగితే శరీరానికి బోలెడు లాభాలు..
→ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి, అలోవెరా జ్యూస్ ఎంతో సహాయపడుతుంది.
→ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఉసిరి, అలోవెరా ఎంతో మేలు చేస్తాయి.
→ ఉసిరి,అలోవెరా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఈ విధంగా ఉసిరిని ఆలోవెరా జ్యూస్‌తో కలిపి తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Soaked Walnuts: నానబెట్టి వాల్ నట్స్‌ను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు చెక్ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter