Guntur Kaaram: అక్కడ మాత్రమే మిశ్రమ స్పందన.. ఇది వ్యాపారం.. గుంటూరు కారంపై దిల్ రాజు

Guntur Kaaram Collections: ఈ సంక్రాంతికి దాదాపు నాలుగు తెలుగు చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. అందులో జనవరి 12న విడుదలైన గుంటూరు కారం సినిమాకి మిశ్రమ స్పందన రాగా.. హనుమాన్ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో దిల్ రాజు గుంటూరు కారం గురించి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2024, 08:02 AM IST
Guntur Kaaram: అక్కడ మాత్రమే మిశ్రమ స్పందన.. ఇది వ్యాపారం.. గుంటూరు కారంపై దిల్ రాజు

మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదల కాగా.. ఈ చిత్రం మొదటి షో నుంచే మిశ్రమ స్పందన తెచ్చి పెట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాపై ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు రావడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా మహేష్ బాబు నటన పరంగా బాగా చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాని పూర్తిగా మహేష్ బాబు అభిమానులు డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు.

ఇక ఈ చిత్రానికి ఈ స్థాయిలో నెగెటివ్ రివ్యూలు రావడంతో సినిమా కలెక్షన్లపై ప్రొడ్యూసర్ నాగవంశీతో పాటు దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా నిర్మాత మాట్లాడుతూ సినిమా చాలా బావుందని కానీ కొన్ని చోట్ల నెగెటివ్ రివ్యూలు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు.

‘సినీ ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరించారు. మొదటిరోజు కలెక్షన్లు మేము అంచనా చేసిన దాని కన్నా ఎక్కువే వచ్చాయి. అయితే రాత్రి ఒంటి గంట షోస్ పడిన చోట్ల కొంచెం మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయ్. కానీ అవన్నీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో వచ్చేటప్పటికీ పాజిటివ్‌గా మారిపోయింది. ఫ్యామిలీస్ అంతా వచ్చి సంక్రాంతికి ఎంజాయ్ చేసే సినిమా గుంటూరు కారం. పాటలు, ఫైట్‌లు, సెంటిమెంట్‌ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా అండి.. దయచేసి మిగిలినవి ఏవీ నమ్మకుండా థియేటర్‌కి వచ్చి సినిమా చూడండి.. మీరు ఎంటర్‌టైన్ అవుతారనే గ్యారెంటీ నాది." అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక దిల్ రాజు మాట్లాడుతూ ఒంటి గంట షోస్ పడిన చోట మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయని.. కానీ సినిమా చాలా బాగుందంటూ అన్నారు.’ ఈ సినిమా ఒంటి గంట షో అయిపోయాక కొంచెం మిక్స్‌డ్ రివ్యూలు  వచ్చాయి. నాకు కూడా షో అయిపోయిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫర్వాలేదండి, యావరేజ్ అని కొందరు.. కొంతమంది మాత్రం బావుంది అని అన్నారు. కానీ నాకు పర్సనల్‌గా సినిమా చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో దాన్నే మళ్లా క్రాస్ చెక్ చేసుకోవడానికి నేనే స్వయంగా సుదర్శన్ థియేటర్లో వెళ్లి సినిమా చూశాను. ఇది ప్రాపర్ మహేశ్ బాబు క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని దర్శకుడు తీసిన చిత్రం. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్స్ ఉన్న సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ నెగెటివ్ వైబ్స్‌, రివ్యూలు మనసులో పెట్టుకొని థియేటర్స్ కి వెళ్లినా సినిమాలోని విషయం కనెక్ట్ అయితే సినిమా స్టాండ్ అవుతుంది. ఎన్నో సినిమాలు చూశాం.. మొదట ఫ్లాప్ప్ టాక్ వచ్చిన..అవన్నీ బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పాజిటివ్ ఫిలిమ్. ప్రేక్షకులు ఈ పండగకి ఎంజాయ్ చేసే సినిమా." అంటూ దిల్ రాజు అన్నారు

‘అంతే కాదు ఈ సినిమా కలెక్షన్స్ అన్నీ చూసిన తర్వాత..ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్స్ పోతాయి. అప్పటివరకూ ఎవరి మీదా మేము కామెంట్ చేసేది లేదు.. చెప్పేది లేదు.. సినిమా బాగుంటే చూస్తారు.. బాగుండే సినిమాను ఏదైనా కానీ ఎవడూ ఆపడు.. అది చరిత్ర అంటూ ధీమాగా చెప్పారు. ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మా అందరికీ యుద్ధం జరగడం సర్వ సాధారణం.. ఎందుకంటే అల్టిమేట్ ఇది వ్యాపారం.. ఇక్కడ ఎవరికి ఎవరూ మిత్రులు కాదు.. శత్రువులు కాదు..  సంక్రాంతి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉంటాయి.. కాబట్టి బిజినెస్ పరంగానే చేస్తాం.. ఇంక రెండు రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరూ మాట్లాడరు..’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News