Benefits Of Applying Tomato On Face: అందంగా కనిపించడం కోసం మార్కెట్లో లభించే వివిధ క్రీములను వాడేస్తుంటారు. దీని వల్ల ముఖం కాంతివంతంగా కనిపించిన చర్మ సమస్యలు రావడం కాయం. క్రీముల వల్ల లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంటాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. నాచురల్ గా కనిపించడానికి కొన్ని పదార్థాలు మనకు సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో టొమాటో ఒకటి. దీనిని మనం ఎక్కువగా కూరల్లో ఉపయోగిస్తాం.
అయితే టొమాటో అనేది కేవలం కూరల్లోనే కాకుండా చర్మ సంరక్షణలో కూడా ఎంతో మేలు చేస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ టొమాటో అందానికి అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బయట ఎక్కువగా తిరిగనప్పుడు ముఖం వెంటనే నల్లగా మారుతుంది. ఇలాంటి సమయంలో టొమాటోతో ముఖంపై రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. టొమాటో ఉండే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మ రంగుని మెరుగుపరచడంలో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి.
టొమాటో- శనగపిండి:
వంటింట్టో ఉండే శనగపిండిని తీసుకోని అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. తరువాత ఇందులో రోజ్ వాటర్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి. టొమాటోని తీసుకొని దానిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ జ్యూస్‌ను కలిపి పెట్టుకున్న మిశ్రమంలో పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించాలి. ఇలా వారానికి మూడు సార్లు చేసుకోవాలి.
టొమాటో-తేనె:
రెండు చెంచాల టొమాటో గుజ్జు తీసుకోవాలి ఇందులోనే తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా ముఖంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది.
Also read: Teeth Pain Tips: పంటి నొప్పితో బాధపడుతున్నారా, ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం
ఓపెన్ పోర్స్ సమస్య అనేది ప్రతి ఒక్కరిని బాధపట్టే సమస్య. దీని కోసం ముల్తానీ మట్టి తీసుకొని అందులో టమాట జ్యూస్ వేసి బాగా కలపాలి. ఇలా తయారైన ప్యాక్‌ని ముఖంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓపెన్ పోర్స్ తగ్గుతుంది.
ఇలా తరచు చేస్తుండం వల్ల మీ ముఖంపై నల్ల మచ్చలు, మొటిమల మాయమైపోతాయి. అంతే కాకుండా చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మీరు కూడా ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ ముఖాన్ని అందంగా తయారుచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also read: Diabetes Diet: మధుమేహహం వ్యాధిగ్రస్థులకు వెజ్, నాజ్ వెజ్‌లో ఏది మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook