Appetite Boosting Foods: పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఇవే!

Appetite Booster For Kids: ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నపిల్లలు భోజనం చేయకుండా ఉంటున్నారు. వారిని చుట్టూ తిరిగి తనిపించలేక తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారికి చేసిన ఇచ్చిన భోజనం కూడా యధాతధంగా తిరిగి తీసుకువస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 03:55 PM IST
Appetite Boosting Foods: పిల్లల్లో ఆకలి కలిగించే ఆహార పదార్ధాలు ఇవే!

Appetite Booster For Kids: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారు తినే ఆహారంలో అనేక పోషకాలు లభించే ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.  కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు తమ తల్లలు చేసే ఆహారం కంటే  మార్కెట్‌ లో లభించే జంక్‌ ఫూడ్‌ను ఎక్కువగా తింటున్నారు.  దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.  అయితే ఆరోగ్యనిపుణుల సూచనల మేరకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ  అహార పదార్థాల నుంచి పోషకాలను సక్రమంగా గ్రహించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

వాము: 

వాములో ఎన్నో ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి. దీనిని పిల్లలకు కూడా తినిపిస్తే వారిలో ఆకలి పుట్టేలా చేస్తుంది.  వాములో ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పిల్లలు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. వాము డైరెక్టుగా తినలేని పిల్లలకు వాము వాటర్ కూడా ఇవ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

కందగడ్డ: 

దుంప కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలలో ఆకలిని పుట్టిస్తుంది. కందగడ్డతో తయారు చేసే కూరలు పిల్లలకు తినిపించడం వల్ల వారి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

కర్ర పెండలం:

కర్ర పెండలం తీసుకోవడం వల్ల ఫైబర్‌ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. కర్రపెండలం వారానికి రెండు సార్లు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read Remedies For Cold And Cough: దగ్గు, జలుబుతో బాధపడుతున్నవారు ఈ చిట్కాను ట్రై చేయండి!

యాలక్కాయలు:

యాలక్కాయలు తీసుకోవడం వల్ల పిల్లలకు ఆకలి శక్తి పెరుగుతుంది. దీనితో వారు ఆహారాన్ని టైంకి తీసుకుంటారు. 

వెజిటేబుల్ సూప్స్:

సూప్స్ అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది సలువుగా జీర్ణనం అవుతుంది. కాబట్టి వెజిటేబుల్ ఇష్టం పడని పిల్లలకు సూప్స్‌లా చేసి ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. 

పండ్లు: 

పిల్లలకు ప్రతిరోజు పండ్లలను ఇవ్వడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. భోసం తర్వాత, లేద ఉదయం పాలతో పాటు పండ్లలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.

Also Read Spring Onion: ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు.. షుగర్‌ సమస్యకు చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News