Pak Punjab Tragedy: పాకిస్తాన్ పంజాబ్ ప్రొవిన్స్ లో ఘోర విషాధం చోటుచేసుకుంది. నిమోనియా కారణంగా దాదాపు 220 చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాధానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణ మార్పులు. తీవ్రమైన చలి కారణంగా 2024 జనవరి 1 నాటికి 10,250 నిమోనియా బారిన పడి చనిపోయారు. వీరంతా ఐదేళ్లలోపు చిన్నారులు కావడం గమనార్హం. కేవలం మూడువారాల వ్యవధిలోనే 220 మంది చిన్నారులు మరణించారు.
అయితే, మరణించిన పిల్లల్లో ఎక్కువ శాతం మహిళలు నిమోనియా టీకాలు వేసుకోని వారేనని పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు వారు పోషకాహారలోపం, బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని చెప్పింది.
పంజాబ్ ప్రావిన్స్‌లో పిల్లలలో నిమోనియా కేసులు పెరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. నిమోనియా నుంచి చిన్నారులను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీనియర్ వైద్యులను ప్రభుత్వం కోరింది. చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో నిమోనియా వ్యాధి వేగంగా పెరుగుతోందని ఈ వ్యాధి కోవిడ్ లాగా విస్తరిస్తోందని అక్కడి ప్రభుతం తెలిపింది.
ఇదీ చదవండి: Mahalakshmi Scheme: మహిళల ఖాతాల్లో ఆరోజే రూ.2,500 జమా.. మహాలక్ష్మి పథకంపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్..!
పంజాబ్‌లోని ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో సాధారణంగా పుట్టిన ఆరు వారాల తర్వాత శిశువులకు యాంటీ నిమోనియా వ్యాక్సిన్‌ను ఇస్తారని చెప్పారు.టీకాలు వేసిన పిల్లలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి బయటపడతారు. నిమోనియా, బాక్టీరియా వైరస్లు రెండింటి వల్ల సంభవించవచ్చు. కానీ వైరల్ న్యుమోనియా ద్వారా ప్రభావితం కావచ్చు. గతేడాది పంజాబ్ ప్రావిన్స్‌లో కూడా నిమోనియా కారణంగా 990 మంది చిన్నారులు చనిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook