Today Rasifal Telugu: ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉందో రాశిఫలాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు శనివారం మీ జాతకం ఏమి చెబుతుంది? ఎలా కలిసివస్తుందో తెలుసకుందాం.
మేషరాశి..
మేషరాశివారు ఈరోజు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో నోరుజారకుండా ఉండాలి. శ్రద్ధగా పని చేయండి. వ్యాపారస్తులు తమ శత్రువులపై ఓ కన్నేసి ఉంచాలి. లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం లేకపోలేదు.
వృషభం..
వృషభరాశివారు ఈరోజు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధతీసుకోవడం మంచిది.ఈరాశివారు ఈరోజు ఆఫీసులో తమ సహోద్యోగులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే మాత్రమే మీరు లాభం పొందుతారు.
మిథునరాశి..
మిథునరాశి పని చేసే వ్యక్తులకు ఈరోజు పని భారం పెరగవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఏమాత్రం అజాగ్రత్త వహించిన సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధతీసుకోవడం కూడా మంచిది.
కర్కాటక రాశి..
కర్కాటకరాశివారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీరు ఆఫీసులో కొంత ఒత్తిడికి లోనై పని చేయవలసి రావచ్చు. సానుకూల ఆలోచనతో పని చేయండి. ఈరోజు వ్యాపారానికి సంబంధించి బయటకు వెళ్లొచ్చు.
సింహరాశి..
ఈరోజు మీరు ఏమాత్రం అజాగ్రత్త వహించిన మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు ఆఫీసులో మీకు మంచి రోజులు ఉండవచ్చు. వ్యాపారవేత్తలు తమ కస్టమర్‌లతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, లేకుంటే మీ డీల్ రద్దు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కన్య రాశి..
కన్యరాశివారు పౌష్టికాహారం తీసుకోవాలి. ఈరోజు మీ మాటలపై నియంత్రణతో ఉండండి. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు విజయాన్ని పొందవచ్చు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు.
తులారాశి ..
తులరాశివారికి కూడా ఈరోజు ఆరోగ్యం మరింత క్షీణించవచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే రోజు హాయిగా గడిచిపోతుంది..
వృశ్చికరాశి...
ఈ రోజు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లయితే పెద్ద ప్రయోజనం పొందవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వృశ్చికరాశివారు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఈరోజు సహోద్యోగులతో చర్చలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి..
ధనస్సు రాశివారికి మోకాళ్ల నొప్పుల సమస్యలను ఎదుర్కోవచ్చు. పనిచేసే వ్యక్తులు కార్యాలయంలో తమ అధికారులకు ప్రతికూల సమాధానాలు ఇవ్వడం మానుకోవాలి. వ్యాపారులకు ఈరోజు సాధారణ రోజు కావచ్చు.
ఇదీ చదవండి: Rajya Yoga: 500 ఏళ్ల తర్వాత అతిశక్తివంతమైన రాజయోగం.. ఈ 3 రాశుల అదృష్టకాలం..!
మకరరాశి..
మకరరాశివారు ముఖ్యంగా ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. పని చేసే వారికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త డీల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
కుంభ రాశి..
కుంభరాశివారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉండవచ్చు. ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఆహార ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు ఈరోజు గొప్ప లాభాలను పొందుతారు.
మీనరాశి..
మీనరాశివారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దెబ్బలు తలిగే ప్రమాదం కూడా ఉంది.కోపం మానుకోండి. పనిని జాగ్రత్తగా చేయండి. వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. శ్రామికులకు ఈరోజు సాధారణ దినం కావచ్చు.
ఇదీ చదవండి: Chanankya Niti: వృద్ధులు వయస్సులో ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటే ఏమవుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook