ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అందరికీ అబ్బురపరిచాడు యువ ఓపెనర్ పృథ్వీ షా. ఓపెనర్ గా వచ్చిన షా ప్రస్తుతం 102 పరుగులతో అజేయంగా ఉన్నాడు. భారత్ స్కోర్ 36 ఓవర్లలో 186 స్కో కాగా అందులో సగానికి పైగా పృథ్వీ స్కోరు ఉండటం విశేషం. పృథ్వీ షా ఆటలో దూకుడుతో పాటు మంచి ఫుట్ వర్క్ కనిపిస్తోందంటున్న క్రీడా విశ్లేషకలు భవిష్యత్తులో భారత క్రికెట్ లో 'షా' కీలక పాత్ర పోషిస్తారడని అంచనా వేస్తున్నారు.
విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌తో కలిసి పృథ్వీ షా ఓపెనింగ్‌కు దిగాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ పృథ్వీషా ఎక్కడా తడబడలేదు. పూజారాతో కలిసి అనుభవజ్ఞుడిలా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సీనియర్ల గైర్హజరుతో రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా వన్డే తరహా ఆడుతూ శతకంతో కదం తొక్కి తన ఎంపిక సరైనదేనని నిరూపించాడు.