Astology-Rahu-Shukra: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. అందం, ఆకర్షణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అటు రాహు, కేతువులను ఛాయా గ్రహాలని పేరు. వీటి కలయిక వల్ల ఈ రాశుల వారికీ 5 రాశుల వారికీ ధన యోగం ప్రాప్తించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గ్రహల్లో శుక్రుడు సంపదలకు,ఆకర్షణకు కారకుడు. శుక్రుడు అనుగ్రహం ఉంటే కళా రంగాల్లో రాణించే అవకాశాలుంటాయి. శుక్రుడి అనుగ్రహం ఉంటే ధనానికి లోటు ఉండదు. అటు రాహు గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో ఛాయ గ్రహాలని పేరు. ప్రస్తుతం అది మీనరాశిలో ఉంది. ఇక శుక్రుడు మరికొన్ని రోజుల్లో మీన రాశిలో ప్రవేశిస్తాడు. దాదాపు పుష్కర కాలం (12 యేళ్ల) తర్వాత ఈ రెండు గ్రహాలు ఒక రాశిలో ఉండనున్నాయి. స్వతహాగా మీనం శుక్రుడికి ఉచ్చ స్థానం కాబట్టి.. కొన్ని రాశుల వారికీ ధనయోగం కలగనుంది.
మిథున రాశి : శుక్ర, రాహు కలయిక వల్ల ఈ రాశుల వారికీ ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. మరోవైపు కొన్నేళ్లుగా ఈ రాశుల వారినీ బాధిస్తోన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
తుల రాశి: కొత్త ఉద్యోగంలో మారాలని చూస్తున్నవారికీ ఇదే అనువైన సమయం. అలాగే గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు సులువుగా పూర్తవుతాయి. అన్నింటా మీదే విజయం.
ధనస్సు : శుక్ర, రాహు కలయికల వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వివాహా ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. మీరు కోరుకున్న అనువైన సమయం ఇపుడు ప్రారంభం అవుతోంది.
మీనం : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరోవైపు ఉద్యోగం చేస్తున్నవారు ఉన్న సంస్థలో ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. దీని వల్ల మీ ఆదాయం పెరుగుతోంది. ఆర్ధికంగా బలోపేతమవుతారు.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..
ఇదీ చదవండి: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook