Paytm Offer for Ram Mandir: కొన్ని సంవత్సరాలుగా ప్రతి భారతీయుడు తీరని కల రామ మందిరం నేడు సాకారమై నిలువెత్తు సాక్ష్యంగా మన కళ్ళ ముందు నిలబడింది.
ఈ చారిత్రాత్మకమైనటువంటి మందిరాన్ని దర్శించడానికి ఇప్పుడు ఎందరో ప్లానింగ్ చేస్తున్నారు. వచ్చేది సమ్మర్ సీజన్ అంటే పిల్లలకు సెలవల కాలం.. ఇక ట్రిప్సు టూర్స్ కామనే కదా.ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆన్లైన్ ప్లాట్ఫారం వాడే వారి సంఖ్య పెంచడం కోసం పేటీఎం సంస్థ సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా అయోధ్యకు వెళ్లడానికి చేసుకునే బస్.. ఫ్లైట్ బుకింగ్ స్పై 100% క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఫ్లైట్స్ తో పాటు బస్సులకి కూడా ఈ ఆఫర్ ఉండడం చాలామంది ప్రయాణికులకు అనుకూలించే విషయం.అయోధ్యకు పేటీఎం ద్వారా బస్సు బుకింగ్ చేసుకుని ఆఫర్ అందుకోవాలి అనుకునే వారు ‘బస్ అయోధ్య’అనే ప్రోమో కోడ్ ని ఉపయోగించాలి. అలాగే మీరు అయోధ్యకి ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నట్లయితే..’ఫ్లైట్ అయోధ్య’అనే ప్రోమో కోడ్ ని వాడాల్సి ఉంటుంది. ఈ ప్రోమో కోడ్ వాడి మీరు బుకింగ్ చేసుకున్నట్లయితే బస్సు ప్రయాణికులకు సుమారు 1000 రూపాయలు.. విమానం టికెట్లు కొన్నవారికి సుమారు 5000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా పేటీఎం సంస్థ ఈ టికెట్లపై ఫ్రీ క్యాన్సిలేషన్ ని కూడా వర్తింప చేస్తుంది. బుకింగ్ చేసుకొని తీరా వెళ్లడానికి కుదరక క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఎక్కడ చార్జెస్ పడతాయో అని ఆలోచించేవారికి ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసింది. అనివార్య కారణాలవల్ల మీరు ప్లాన్ చేసుకున్న ట్రిప్ కు వెళ్లలేక టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు 100% చార్జీలు రిఫండ్ అవుతాయి. అలాగే బస్సుకి లైవ్ ట్రాకింగ్ సర్వీస్ ని అందించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని చేకూరుస్తోంది. ఈ ఆఫర్ పై చాలా మంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా అయోధ్యకు వెళ్లే పని అయితే ఖచ్చితంగా పేటీఎం ద్వారా బుక్ చేసుకుని క్యాష్ బ్యాక్ పొందండి.
Also read: Income Tax Slab: బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారనుందా, పాత, కొత్త ట్యాక్స్ విధానాల అంతరం ఇదే
Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి