Googled Fastest Route: సాధారణంగా మనకు తెలియని ఏ కొత్త రూట్లైన వెతకడానికి ఈరోజుల్లో గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతాం. అయితే, తమిళనాడులో ఒక వ్యక్తికి ఓ వింత అనుభవం ఎదురైంది. గూడలూరుకు నుంచి ఓ వ్యక్తి వీకెండ్ లో స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి ఎస్ యూవీ లో వెళ్లాడు. ఈ ప్రాంతం ఊటీ వెళ్లే ప్రయాణికులు మంచి వీకెండ్ స్పాట్. అయితే, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గూగుల్ మ్యాప్ ఫాస్టెస్ట్ రూట్ ను ఫాలో అయ్యాడు. చివరికి ఎక్కడికి వెళ్లాడో తెలిస్తే షాక్ గురవుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఫాలోయర్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
చాలామంది పల్లె నుంచి పట్నంలో ఉన్నవారు సైతం ఏదో ఒక సమయంలో గూగుల్ మ్యాప్ పై ఆధారపడతారు. దీని ద్వారా ట్రాఫిక్ ను నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. కర్కాటకకు చెందిన ఈ వ్యక్తి వీకెండ్ పార్టీ ఎంజాయ్ చేసి వస్తుండగా గూడలూరులోని కొండప్రాంతంలోకి గూగుల్ మ్యాప్ తీసుకెళ్లింది. అక్కడ చివరకు పోలీస్ క్వార్టర్స్ గుండా నివాసాలు ఉండే మెట్లపైకి దూసుకెళ్లి ఎస్ యూవీ కదలలేని పరిస్థితుల్లో చిక్కుకుపోవాల్సిన పరిస్థతి ఎదురైంది. ఈసమయంలో అతని స్నేహితులు కూడా అతనితోపాటు ఉన్నారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో స్థానికుల సహాయం తీసుకున్నారు.
స్థానికుల సాయంతో పోలీసులు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాగోఅలా పోలీసులు, స్థానికులు కారును ప్రధాన రహదారిపై తీసుకుచ్చారు.గూడలూర్ తమిళనాడు, కేరళ, కర్ణాటకల మధ్య ఉంది. వారంతం సెలవులు గడపడానికి ఈ ప్రదేశానికి వెళ్తారు.
ఇదీ చదవండి: Side Effect of Paper Cup: మీరూ పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!
ఇదీ చదవండి: Jobs in Supreme Court: లా పట్టాదారులకు గుడ్ న్యూస్.. రూ. 80 వేల జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook