Game On - Geethanand: గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ'గేమ్ ఆన్'. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా హీరో గీతానంద్ మీడియాతో మాట్లాడారు.
ఇదొ యూనిక్ స్టోరీ. రెగ్యులర్‌గా కాకుండా డిఫరెట్ ఉండాలని ఈ సినిమా చేసాము. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దీనిలో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ దయానంద్ మా తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకునే వాళ్లాం. మేమిద్దరం కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాం. తమ్ముడు స్టోరీ రాస్తే నేను యాక్ట్ చేసే వాడిని. లేదంటే వాడి స్టోరీను నేను డైరెక్ట్ చేసే వాడిని. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ తో పాటు సింక్ ఏర్పడింది. ఈ సినిమా విషయంలో మాకు ఆ ఎక్స్‌పీరియన్స్ బాగా యూజ్ అయింది. రియల్ టైం సైకలాజికల్ గా సాగే ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్ లోకి ఆటోమేటిగ్‌గా వెళ్ళిపోతారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా ఉంటాయి.
నేహా సోలంకి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. ఆమె కూడా ఇందులో కీ రోల్ లో కనిపిస్తుంది. సీనియర్ నటులు మధుబాల, శుభలేఖ సుధాకర్, ఆదిత్య మీనన్ ఇందులో నటించడంతో ఈ సినిమాను లెవల్ పెరిగింది. మధుబాల గారు ఇప్పటివరకు కనిపించని కొత్త క్యారెక్టర్‌లో ఈ సినిమాలో కనిపిస్తారు. ఇందులో క్రేజీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ప్రేక్షకులు ఎవరు ఊహించలేరు అనేంతగా ఉంటుంది. ఆదిత్య మీనన్ గ్రేషేడ్ లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్ మా తాత పాత్రలో ఎంతో ఇన్‌స్ప్రైరింగ్ రోల్ చేశారు.
ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా మిక్సింగ్ అంతా చెన్నై లోని ఏఆర్ రెహమాన్ స్టూడియోలో జరిగింది. థియేటర్లో సౌండ్ పవర్ పాక్డ్‌గా ఉంటుంది. టెక్నికల్ పరంగా అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకున్నాం. నిర్మాత రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో ముగ్గురం కలిసి డిస్కషన్ చేసుకొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళం. అందుకే విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. పాటలు చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రతి క్రాఫ్ట్ ను నేను కూడా చూసుకోవడంతో నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది.
గత మూడు రోజులుగా వేస్తున్న ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. యంగ్ ఏజ్ నుంచి పెద్దవాళ్ల వరకు షోస్ వేశాం. అందరి దగ్గర నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండస్ట్రీ నుంచి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారు సినిమా చూసి ఎక్సైట్ అయ్యారు. అలాగే రిలీజ్ కి ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కు ఫ్యాన్సీ ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉంది. సీక్వెల్ కోసం వేరే ప్లానింగ్ అయితే ఉంది. ఈ సినిమాకు వచ్చే రియాక్షన్ ను బట్టి అది ప్రకటిస్తాము. అలాగే మూడు కొత్త కథలు విన్నాను అవి కూడా త్వరలో ప్రకటిస్తాను.
Also Read: Budget 2024: నిర్మలమ్మ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో కీలకమైన 'ఆరు' అంశాలేమిటో తెలుసా..
Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter