Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. అసలే చలికాలం ప్రారంభం కావడంతో వర్షాల ప్రభావంతో చలి మరింతగా పెరుగుతోంది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో తరచూ ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాల ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరోసారి ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది కాస్తా పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపుకు ప్రయాణం చేయనుంది. ఫలితంగా ఏపీలోని ఈ నెల 11 నుంచి 13 వరకూ రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అటు సముద్రం కూడా అలజడిగా ఉండనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య,,తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ నెల11 నుంచి మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.