Under-19 World Cup 2024: అండర్-19 ప్రపంచకప్ 2024లో యంగ్ ఇండియా ఇరగదీస్తుంది. ఢిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన యువభారత్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ పోరు అర్హత సాధించింది. భారత్ తుదిపోరుకు అర్హత సాధించడం ఇది 9వ సారి. ఈ నేపథ్యంలో అండర్-19 వరల్డ్ కప్ ను టీమిండియా ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలుచుకుందో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు 14 అండర్ 19 ప్రపంచకప్‌లు జరగ్గా భారత జట్టు 5 సార్లు ఛాంపియన్‌గా నిలవగా.. మూడు సార్లు రన్నరప్ అయింది. తొలిసారి భారత్ మహ్మద్ కైఫ్ నాయకత్వంలో 2000వ సంవత్సరంలో ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. పైనల్లో శ్రీలంకను ఓడించింది. రెండోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను 2008లో విరాట్ కోహ్లి నేతృత్వంలో గెలుచుకుంది. తుది పోరులో సౌతాప్రికాను ఓడించింది విరాట్ సేన.
Also Read: U19 World Cup 2024: దక్షిణాఫ్రికాను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్..
మూడోసారి ఛాంపియన్ గా 2012లో నిలిచింది భారత జట్టు. ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో యువ భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది. 2018లో పృథ్వీ షా నాయకత్వంలోని యంగ్ ఇండియా అండర్-19 ప్రపంచకప్‌ను నాలుగోసారి గెలుచుకుంది. ఫైనల్లో ఆసీస్ ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. 2022లో యశ్ ధుల్ నేతృత్వంలోని యువ భారత్ తుదిపోరులో ఇంగ్లండ్ ను ఓడించి ఐదోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు టీమిండియా రెడీ అయింది. 2006, 2016, 2020లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
Also Read: India Vs Zimbabwe: జింబాబ్వేతో టీమిండియా టీ20 సిరీస్.. షెడ్యూల్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి