‘మీటూ’ ఉద్యమాన్ని సమర్ధిస్తూ ట్విట్టర్ వేదికపై రియాక్ట్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ సమంతకు గౌరవ్ ప్రధాన్ అనే నెటిజన్ ఓ అసక్తికర ట్వీట్ చేశాడు. ‘మీటూ’పై తన కొడుకుతో జరిగిన సంభాషణను ఇక్కడ ప్రస్తావించాడు.. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే ...
సమంతను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఈరోజు మా అబ్బాయి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ‘డాడీ అసలు ఈ ‘మీటూ’ అంటే ఏంటి?’ అని ప్రశ్నించాడు... అప్పుడు నేను దీనికి బదులిస్తూ ‘మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్ బీమా పథకం’ అన్నాను. దీనికి మా అబ్బాయి ‘అదెలా?’ అని మరో సారి ప్రశ్నించాడు. ‘ ఆడవారు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకర్లు వార్తలిస్తుంటారు.’ అని చెప్పాను. ఇది విని మా అబ్బాయి ‘గాడ్ బ్లెస్ ఇండియా’ అన్నాడు’ అని గౌరవ్ పేర్కొన్నాడు.
‘మీటూ’ ఉద్యమంపై నెటిజన్ గౌరవ్ ప్రధాన్ హ్యూమరస్ గా చెప్పిన వ్యాఖ్యలపై సమంత కాస్త ఘాటుగానే ప్రతి స్పందించింది.....‘ఇదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెప్తారు?’ అని ప్రశ్నించింది.
Today my son asked me
Papa what is this #MeToo ?
I said : It is a retirement Insurance plan for ladies
Son : How?
I said : Ladies indulge in everything but when Career is over, revoke this Insurance plan and ppl like Barkha and Arnab will get you cover
Son : God bless India
— #GauravPradhan 🇮🇳 (@DrGPradhan) October 9, 2018