తిత్లీ ఎఫెక్ట్ ; 8 మంది దుర్మరణం, నీట మునిగిన లక్షలాది ఎకరాలు

                              

Last Updated : Oct 12, 2018, 02:45 PM IST
తిత్లీ ఎఫెక్ట్ ; 8 మంది దుర్మరణం, నీట మునిగిన లక్షలాది ఎకరాలు

శ్రీకాకుళం: తిత్లీ  తుపాను హుద్‌హుద్‌ను తలపించింది. హుద్ హుద్ వల్ల నాడు విశాఖ పట్నం భారీగా నష్టపోతే.. తిత్లీ  తుపానుతో నేడు శ్రీకాకుళం కకావికలమైంది. తీరం దాటిన 12గం టల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భీకర గాలివేగానికి  విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయి. 30 సెం.మీ. కురిసిన వాన వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఉద్దానంలో కొబ్బరి, అరటి, జీడిమాడి తోటలకు తీవ్ర నష్టం  జరిగింది. జాతీయ రహదారులు జల దిగ్బంధంలో ఉన్నాయి.

గాలికి ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

తిత్లీ గాలి వేగానికి పలుచోట్ల రహదారులపై నిలిపి ఉంచిన భారీ లోడు లారీలు కూడా బోల్తాపడ్డ ఉదంతాలు పలువుర్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. వేల సంఖ్యలో పూరిళ్లు, పెంకుటిళ్లు, సిమెంటు రేకుల ఇళ్ల పైకప్పులు కుప్పకూలి, గాలికి ఎగిరిపోయి పలుచోట్ల గోడలు మాత్రమే మిగిలాయి. లక్షలాదిగా చెట్లు, వేలాది విద్యుత్తు స్తంభాలు, సెల్‌టవర్లు కూలిపోయాయి. తీర ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ బాగా దెబ్బతింది. తుపాను కారణంగా 8 మంది దుర్మరణం . శ్రీకాకుళం పలాస సమీపాన తీరం దాటిన తుపాను ...శ్రీకాకుళంతో పాటు ఒడిశాలో ఐదు జిల్లాలపై ప్రభావం నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తిత్లీ ప్రభావం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు నుంచి సహాయక చర్యలు ప్రారంభించారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనే దానిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పలు స్వచ్ఛంధ సంస్ధలు బాధితులను ఆదుకునేందుకు విరాళాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి.

 

Trending News