Love Your Father: తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే 'లవ్ యువర్ ఫాదర్'.. సినిమా షూటింగ్ మొదలు..

LYF: తండ్రి కొడుకుల మధ్య ప్రేమని చూపించే సినిమాలు ఎన్నో తెలుగులో వచ్చి సూపర్ సక్సెస్ సాధించాయి. నాన్నకు ప్రేమతో చిత్రం దగ్గర నుంచి ముందు విడుదలైన యానిమల్ సినిమా వరకు.. ఈ ఎమోషన్ తో ముందుకు సాగిన కథలు సూపర్ హిట్ అందుకున్నాయి.. ఈ నేపథ్యంలో మరో చిత్రం కూడా ఇదే దావలో రాబోతోంది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 08:00 AM IST
Love Your Father: తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే 'లవ్ యువర్ ఫాదర్'.. సినిమా షూటింగ్ మొదలు..

Love Your Father: నాన్నకు ప్రేమతో సినిమా దగ్గర నుంచి మొన్న విడుదలైన యానిమల్ చిత్రం వరకు తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ చూపించే సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఎమోషన్ తో రాబోతోంది మరో చిత్రం. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం లైఫ్ లవ్ యువర్ ఫాదర్. మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించింది. శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ పవన్ కేతరాజు దర్శకత్వంలో.. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా LYF 'Love Your Father' అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు  మల్లారెడ్డి కాలేజీలో చాలా ఘనంగా జరిగాయి. ఈ మూవీ కెమెరా స్విచ్ ఆన్ నెంబర్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కామకూర శాలిని.. చెయ్యగా.. ఈ చిత్రానికి సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు క్లాప్ కొట్టారు. 

 గోపాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం రెడ్డి, సంతోష్ రెడ్డి స్క్రిప్ట్ అందించిన ఈ చిత్ర పూజా కార్యక్రమంలో హై
. ముఖ్య అతిథులుగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భద్ర రెడ్డి గారు, ప్రీతి రెడ్డి గారు, మల్లారెడ్డి హెల్త్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సి. హెచ్. మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ ఏ. రామస్వామి రెడ్డి గారు, హీరో శ్రీహర్ష, రియా, దర్శకుడు పవన్ కేతరాజు, ఎస్. పి. చరణ్, మణీంద్ర కుమార్, నిర్మాతలు కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, అన్నపురెడ్డి సామ్రాజ్యలక్ష్మి తో పాటు మరి కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి మహేష్ రాఠీ గారు మాట్లాడుతూ ‘1983 నుంచి ఇప్పటివరకు మా మనిషా యాక్షన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లో  ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమా లైఫ్ లవ్ యువర్ ఫాదర్ ఒక మంచి తండ్రి కొడుకుల మధ్యనున్న ఎమోషన్స్ని, బాండింగ్ ని చూపించే విధంగా ఉంటుంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మా నాన్నగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో శ్రీహర్ష మాట్లాడుతూ..’ఇది నా మొదటి సినిమా .. నేను ఈ సినిమా కోసం 100% కష్టపడ్డాను. మీ సపోర్ట్.. ఆశీర్వాదాలు ఎప్పుడు నాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ చిత్ర హీరోయిన్ రియా మాట్లాడుతూ..’ ఈ సినిమాలో నేను మేఘన క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి మెమరీ మీతో తీసుకెళ్తారు’ అని అన్నారు.

దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ..’ గతంలో కో డైరెక్టర్ గా చాలా సినిమాలకు నేను వర్క్ చేశాను. సూర్య ది గ్రేట్, దర్యాప్తు, యమలీల, మాయలోడు, వినోదం లాంటి ఎన్నో మంచి హిట్ సినిమాలు అందించిన మనిషా ఫిలిమ్స్ బ్యానర్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ గారు నన్ను పిలిచే అవకాశం చాలా సంతోషంగా ఉంది. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ ఈ సినిమా లైఫ్ 'లవ్ యువర్ ఫాదర్'. అదేవిధంగా శివోహం కాన్సెప్ట్ ని తీసుకుని ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాం. ఈ సినిమా ఖచ్చితంగా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌

Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం

 

 

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News