Vastu Tips: రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తే ఏం జరుగుతుంది? ఏం చేయాలి?

Money Found on Road vastu: జోతిష్యంలో మన నిత్యజీవితంలో జరిగే ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. అలాగే ఒక్కోసారి మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఏం జరుగుతుంది? ఆ డబ్బును ఏం చేయాలి. జోతిషులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 24, 2024, 12:51 PM IST
Vastu Tips: రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తే ఏం జరుగుతుంది? ఏం చేయాలి?

Money Found on Road vastu: జోతిష్యంలో మన నిత్యజీవితంలో జరిగే ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. అలాగే ఒక్కోసారి మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే ఏం జరుగుతుంది? ఆ డబ్బును ఏం చేయాలి. జోతిషులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం.

అప్పుడప్పుడు మనకు రోడ్డుపై కాయిన్స్ లేదా నోట్లు కనిపించడం చూస్తాం. కొంతమంది వాటిని తీసుకుంటారు. మరికొంతమంది తీసుకుంటే ఏమవుతుందో? ఈ డబ్బును ఏం చేయలి? ఇంటికి తీసుకెళ్లొచ్చా? అని ఆలోచిస్తారు. అయితే, నిజానికి ఇలా రోడ్డుపై డబ్బు పడిఉండటం కనిపిస్తే మనకు శుభం కలుగుతుందా? ఇంకా ఏదైనా సూచనా? పండితులు ఏం చెప్పారు?

మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో ఇలా డబ్బు రోడ్డుపై పడి ఉండటం కనిపిస్తే మీరు ఎటువంటి సంకోచం లేకుండా పనిని వెంటనే ప్రారంభించండి.. అంతేకాదు ఇలా డబ్బు రోడ్డుపై దొరికితే త్వరలో మీరు మీ పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశం ఉందని అర్థమట.

ఇదీ చదవండి: Shani Transit 2024: శని అనుగ్రహం.. ఈ రాశుల వారికి వచ్చే 10 నెలలు వరం..!

ఏదైనా పని మీద మీరు బయటకు వెళ్లినప్పుడు ఇలా రోడ్డు కాయిన్స్ లేదా నోటు కనిపిస్తే మీ పని సక్రమంగా పూర్తవుతుందట. రోడ్డుపై డబ్బు పడిఉండటం శుభసూచకం. మీ పని విజయవంతమవుతుందని అర్థం. అంతేకాదు ఇలా డబ్బు హఠాత్తుగా కనిపిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థమట.

రోడ్డుపై డబ్బు పడి ఉండటం కనిపిస్తే మీ ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలన్నీ సఫలమవుతాయని అర్థం. అంతేకాదు, రోడ్డుపై డబ్బు కనిపించడం అంటే మీ పెద్ద సమస్యలు కొన్ని త్వరలో పరిష్కారమవుతాయి. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది..

ఇదీ చదవండి: ఈ తేదీల్లో జన్మించినవారు కెరీర్‌లో తమకు నచ్చిన ఉద్యోగం చేస్తారట..

రోడ్డు మీద దొరికిన డబ్బు మంచి సంకేతమే అయినప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే అది ఎవరికి చెందుతుందో వారికి ఇవ్వడం మంచిది. సదరు వ్యక్తి మీకు కనిపించకపోతే పేదలకు దానం చేయండి. అంతేకాదు ఇలా రోడ్డుపై దొరికన డబ్బును గుడి హుండీలో కూడా వేయొచ్చు. కానీ, ఇంటికి తీసుకెళ్లకండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News