Shocking Video: ఫీక్స్ లో గేదె కోపం.. రోడ్డు మీద జనాలు పాపం.. వైరల్ అవుతున్న వీడియో..

Viral Video: సాధు జంతువులైన గేదెలు, ఆవులకు కోపం వచ్చిందంటే అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడికి తెగబడతాయి. తాజాగా ఓ గేదె నడిరోడ్డుపై బీభ్సతం సృష్టించింది. దానిని ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 09:16 PM IST
Shocking Video: ఫీక్స్ లో గేదె కోపం.. రోడ్డు మీద జనాలు పాపం.. వైరల్ అవుతున్న వీడియో..

Buffalo Angry Video viral: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక డిఫరెంట్ గా ఏది చేసిన ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ మధ్య ఎక్కువగా యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే... మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని అయితే వణికిస్తున్నాయి.  సాధారణంగా ఆవులు, గేదెలు పెద్దగా ఎవరికీ హానీ కలిగించవు. వాటికి తిక్కరేగిందంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టవు, తొక్కిపడేస్తాయి. తాజాగా ఓ గేదె నడిరోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

కేరళ కోచిలోని ఎయిర్‌పోర్ట్ రోడ్డు మధ్యలో ఓ గేదె (Buffalo) నిల్చుని ఉంటుంది. అప్పుడే ఓ వ్యక్తి స్కూటీ మీద గేదె ముందు నుంచి వెళ్తూంటాడు. అప్పటికే కోపంతో రగలిపోతున్న ఆ గేదె ఒక్కసారిగా స్కూటీపైకి దూసుకెళ్తోంది. దాంతో ఆ వ్యక్తి కిందపడిపోతాడు. అంతటితో ఆగకుండా ఆ వ్యక్తిని తన కొమ్ములతో కుమ్మేస్తోంది ఆ గేదె. ఇంతలో కొందరు అతడిని రక్షించే ప్రయత్నం చేస్తారు. అయితే గేదె వారిపైకి కూడా దూసుకెళ్తోంది. దాంతో వారు దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తారు. ఈ వీడియో wander_diaries అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే 4.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా దీనిపై నెటిజన్స్ కామెంట్స్ వర్షం కూడాకురిపిస్తున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KERALA / INDIA 🌏TRAVEL / YATHRA / WANDERING (@wander_diaries__)

Also Read: Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. టమాటాలను ఇలా కూడా కట్ చెయొచ్చా..!

Also Read: iPhone 15: అమెజాన్ లో ఐఫోన్ 15 ఆర్డర్ చేశాడు.. పార్శిల్‌ ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News