Abhaya Hastham Scheme: మీకు బైక్ ఉంటే ఈ పథకం వర్తించదట.. ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా?

Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపడుతోంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 25, 2024, 03:24 PM IST
Abhaya Hastham Scheme: మీకు బైక్ ఉంటే ఈ పథకం వర్తించదట.. ఈ లిస్టులో మీరు కూడా ఉన్నారా?

Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపడుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. 

ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది.మేడారం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంకా గాంధీ హాజరవుతారని వెల్లడించారు.

ఇదీ చదవండి: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదాలకు రూ.5 లక్షలు కేటాయించనుంది. ఇదిలా ఉంటే టూ వీలర్ ఉన్నా... చిన్నకారు ఉన్నా.. ఇందిరమ్మ పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లలో ఉపయోగిస్తున్న కరెంటును కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

ఇదీ చదవండి: Mahalakshmi LPG Gas Cylinder: రూ. 500 గ్యాస్ సిలిండర్‌పై కీలక అప్డేట్.. ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే..

ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు..
1. దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
2. వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు.

ప్రతిఏటా ఎంతమంది అర్హులను ఎంపిక చేయనుంది తదితర విషయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.అయితే, తాజాగా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.  ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఎంపిక ప్రక్రియ కూడా ముమ్మరం చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందట. ఈ పథకం కింద దాదాపు 84 లక్షల వరకు అప్లకేషన్స్ రాగా వాటిని ఆధునిక సాంకేతికతో వడపోత కార్యక్రమం చేపట్టనున్నారట.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News