Diabetes Diet: ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, చెడు జీవనశైలి మధుమేహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మధుమేహానికి కచ్చితమైన, నిర్ధిష్ట చికిత్స లేకున్నా నియంత్రణ మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అంటే డైట్ కంట్రోల్ ఉండాలి. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మధుమేహం నియంత్రణలో డ్రై ఫ్రూట్స్ కీలకంగా ఉపయోగపడతాయనేది ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ రీసెర్చ్ ప్రకారం కేవలం 28 గ్రాముల డ్రై ఫ్రూట్‌తో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా నియంత్రించవచ్చని తేలింది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా ఉంటే డయాబెటిస్ ఉందని అంటారు వాస్తవానికి గ్లూకోజ్ అనేది శరీరానికి కావల్సిన ఎనర్జీని అందించేది అయినా ఎక్కువ ఉండకూడదు. లెవెల్స్ ఎక్కువైతే ఆరోగ్య సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా గుండె వ్యాధులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు, వ్యంధత్వం, నెర్వ్ డ్యామేజ్ సమస్యలు తలెత్తవచ్చు.
మధుమేహం వ్యాధి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి సోకిందంటే ఎప్పటికీ వదలదు. జీవితాంతం డయాబెటిస్ నియంత్రణలో ఉండే ప్రయత్నాలే చేస్తుండాలి. చికిత్స లేదు గానీ సరైన డైట్, వ్యాయామం, తగిన మందుల ద్వారా అదుపులో ఉంచవచ్చు. డయాబెటిస్ డైట్లో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలంటారు. రోజూ క్రమం తప్పకుండా కేవలం 28 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తింటే డయాబెటిస్ ఎంత ప్రమాదకర స్థాయిలో ఉన్నా తగ్గించవచ్చు. ప్రీ డయాబెటిక్ లేదా మధుమేహ వ్యాదిగ్రస్థుల్లో అధ్యయనం చేసినప్పుడు ఆసక్తి కలిగించే పరిణామాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని 40-60 ఏళ్ల వయసు కలిగిన రోగులపై జరిగింది.
దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాదపడుతూ మందులు తీసుకుంటూ ఉన్న రోగులు కూడా ఉన్నారు. వీరందరికీ రోజూ ఉదయం వేళ నిర్ణీత మోతాదులో డ్రై ఫ్రూట్ ఇచ్చేవారు. మొదట 180-250 ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ డ్రై ఫ్రూట్స్ డైట్ తరువాత 180 కంటే దిగువకు రావడం గమనించారు. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం, పిస్తా, వేరుశెనగ, వాల్నట్స్, జీడిపప్పును పరిమితంగానే ఇచ్చేవారు. తొక్కతో పాటు ఆరు బాదం పిక్కలు, మూడు పిస్తా, రెండు వాల్నట్స్, ఆరారు వేరుశెనగ, జీడిపప్పు ఈ ప్రత్యేక డైట్లో ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్ డైట్ ఎందుకు సమర్ధవంతంగా పనిచేసిందంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్‌తో పాటు అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గడం గమనించారు.
Also read: Male Menopause: పురుషుల్లో కూడా మెనోపాజ్ ఉంటుందా, ఎలాంటి లక్షణాలుంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook