TS Mega DSC Notification 2024: ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విదలైంది. దీంతో రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ భర్తీ చేయనుంది. 11,062 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష మే మూడోవారంలో జరగనుంది.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. గత సంవత్సరం అంటే 2023లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లై చేసుకునే అవసరం లేదు. డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: 182
ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ టీచర్: 6508
స్కూల్ అసిస్టెంట్ :2629
లాంగ్వేజ్ పండిట్స్: 727
ఇదీ చదవండి: Telangana DSC: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. రేపే కొత్తది..!
మొత్తంగా 11,062 పోస్టుల భర్తీ అప్రూవల్ కోసం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ పంపింది. నిన్నే నోటిఫికేషన్ విడుదలవ్వాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యమైంది. గత సంవత్సరం 5,089 ప్లాన్ చేయగా దానికి మరిన్ని ఖాళీలను కలిపి ఈ మెగా డీఎస్సీని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది పోస్టులకు 1,77,502 అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి మరిన్ని దరఖాస్తులు రానున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు భారీ ఏర్పాట్లు చేయనున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాసైన అభ్యర్థులు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు. వీరు ఈ మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి: Gruha Jyothi: ఫ్రీ కరెంట్ కదా అని ఇలా చేశారంటే కరెంట్ కట్.. కేస్ ఫైల్..
దరఖాస్తులు ఎప్పటి నుంచి?
మెగా డీఎస్సీకి దరఖాస్తు మార్చి 2 నుంచి ప్రారంభంకానుంది. ఇక చివరి తేదీ ఏప్రిల్ 2 వరకు. ఈ నోటిఫికేషన్‌కు అర్హులైన అభ్యర్థులు రూ.1000 చెల్లించి అన్లైన్లో అప్లై చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా మెగా డీఎస్సీ పరీక్షలు చేపట్టనుంది. దాదాపు 11 సెంటర్లు నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ కు వయోపరమితి 46 గా నిర్ణయించింది. అధికారిక ప్రకటన దీనిపై త్వరలో రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter