Telangana Government Schemes: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఈ రోజు పథకానికి సంబంధించిన జీవో జారీ చేశారు..కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ పథకాలను అమల్లోకి తీసుకువస్తుంది. ఈ పథకంలో భాగంగా మహిళలకు రూ.500 గ్యాస్ సిలిండర్ ను అందించనుంది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది.
ఇదీ చదవండి: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి నిన్న జీవో జారీ చేశారు. ఈనేథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు.అయితే, ఫ్రీ విద్యుత్ పథకానికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ప్రభుత్వం జారీ చేసింది. ముఖ్యంగా ఉచిత విద్యుత్తు కదా.. అని అడ్డగోలుగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవు. విద్యుత్ చట్టం 2003 ప్రకారం కమర్షియల్ అవసరాలను విద్యుత్ వాడుకుంటే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంతేకాదు ఉచిత విద్యుత్ అని అవసరాలకు మించి వాడితే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే గతంలో కేవలం 100 యూనిట్ల వరకు ఉపయోగించిన వారు ఇప్పుడు దానికి మించి వాడితే విద్యుత్ కు డిమాండ్ ఎక్కువవుతుంది. సరఫరాలో కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మార్ల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంటుందని ఆలోచిస్తున్నారట యంత్రాంగం.అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరో హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల అంటే మార్చికి సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించనవసరం లేదని ప్రకటించారు. గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదాలకు రూ.5 లక్షలు కేటాయించనుంది. ఇదిలా ఉంటే టూ వీలర్ ఉన్నా... చిన్నకారు ఉన్నా.. ఇందిరమ్మ పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లలో ఉపయోగిస్తున్న కరెంటును కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter