Rice Water Benefits For Hair: మహిళలు, పురుషులు జుట్టు నల్లగా, పొడవుగా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా చాలా మంది జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పోషక ఆహారం పట్ల అశ్రద్ధ వహించడం, వాతావరణం మార్పులు ఇతర సమస్యల కారణంగా ఈ సమస్య బారిన పడుతున్నారు.
ఆరోగ్యకరమైన, నల్లటి, పొడవైన జుట్టు కోసం మార్కెట్‌లో వేలకు వేలకు పోసి ప్రొడెక్ట్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రొడెక్ట్స్ ఉపయోగించడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. కానీ ఉపశమనం కలగటం లేదు. అయితే మీరు ఎలాంటి ప్రొడెక్ట్స్, మందులను ఉపయోగించకుండానే మీరు కోరుకున్న జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దీని కోసం మీరు కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా బియ్యం నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని మీరు వాడటం వల్ల నల్లటి, ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. అయితే ఈ బియ్యంనీరు మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం.
రైస్ వాటర్ చుండ్రుకు ఉపయోగాలు:
రైస్ వాటర్ జుట్టు పెరుగుదా కోసం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టును పోషించి, దృఢంగా చేయడానికి సహాయపడుతుందనే నమ్మకం ఉంది.
ఎందుకు ఉపయోగపడుతుంది?
అమైనో ఆమ్లాలు:
బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పునరుద్ధరణకు సహాయపడి, జుట్టు వేగంగా పెరగడానికి దోహపడతాయి.
విటమిన్లు:
ఇందులో విటమిన్ బి, సి, ఇ వంటి విటమిన్లు కూడా బియ్యం కడిగిన నీటిలో ఉంటాయి. ఇవి కూడా జుట్టు పెరుగుదాకు సహాయం చేస్తాయి.
ఎలా ఉపయోగించాలి?
బియ్యం కడిగిన నీటిని ఉపయోగించడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయని కొందరు నమ్ముతారు. అయితే బియ్యం కడిగిన నీటిని ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందా లేదా అనే దానిపై శాస్త్రీయ ఆధారాలు లేవు.
బియ్యం కడిగిన నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి షాంపూ చేసిన తర్వాత జుట్టుకు స్ప్రే చేసుకోవచ్చు. నీటిని జుట్టుకు రాసి కొన్ని నిమిషాలు అలా ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయవచ్చు.
ముఖ్య గమనిక:
బియ్యం కడిగిన నీటి వల్ల జుట్టు పెరుగుదల ప్రయోజనాలు పరిశోధన ద్వారా నిరూపించబడలేదు. కానీ ఇది జుట్టును మెరుగుపరుస్తుందని చాలా మంది నమ్ముతారు.
మీ జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే లేదా మీ జుట్టు ఆరోగ్యంగా లేకపోతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
Also Read: Sprouts Dosa: కేవలం రెండు నిమిషాల్లో తయారు చేసుకొనే మొలకల దోశ !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter