Daily Headache: సాధారణంగా ఈ బిజీ లైఫ్‌లో తలనొప్పి రావడం మాములు. అయితే, కొంతమందికి ప్రతిరోజూ తలనొప్పిగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం విపరీతమైన స్ట్రెస్, నిద్రలేమి. సరైన నిద్ర లేకపోవడం కూడా తలనొప్పి సమస్య వస్తుంది. కొందరికి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల తలనొప్పి సమస్య వస్తుంది. ఉదయం లేవగానే తలంతా బరువుగా, నొప్పిగా అనిపిస్తుంది. దీనికి కొన్ని హోం రెమిడీ ట్రై చేస్తే తలనొప్పి సమస్య నంచి ఉపశమనం కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
ప్రతిరోజూ ఉదయం లేవగానే తలనొప్పిగా ఉంటే టీ లేదా కాఫీని తాగుతారు. తలనొప్పి సమస్యకు తులసి టీ తాగండి. ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. లేదా తులసి ఆకులను వేసి మరిగించి తులసి టీ ని తయారు చేసుకోవచ్చు. స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పికి చెక్ పెట్టొచ్చు.
విపరీతమైన స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పికి తులసి టీ గొప్ప రెమిడీ. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది. ప్రతిరోజూ తగినంత నీరు తీసుకోవడం మంచిది. అందుకే మీ డైట్లో తులసిని చేర్చుకోండి. తలనొప్పి వేధిస్తుంటే పనులను కాస్త పక్కనపెట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో ఏ పనిచేయలేం కూడా.
ఇదీ చదవండి: జుట్టు పెరుగుదల కోసం రైస్ వాటర్.. దీని ఎలా ఉపయోగించాలి..
నిద్రలేమి కొన్ని మానసిక, శారీరక సమస్యల వల్ల వస్తుంది. ఇది కూడా మరుసటి రోజు తలనొప్పికి దారితీస్తుంది. సరైన నిద్ర పోవడం ఆరోగ్యకరం. తులసిని టీ రూపంలో కాకుండా రసాన్ని నుదుటిపై కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మంచి రెమిడీ. తలనొప్పి తగ్గుతుంది.
అంతేకాదు, ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులను కడిగి నమలడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల మెదడు పదును పెరుగుతుంది. తలనొప్పి సమస్యకు తక్షణ ఉపశమనం కూడా లభిస్తుంది..
సరైన నిద్రపోవడానికి నిద్రలేమి సమస్య రాకుండా ఉండాలంటే అతిగా ఆలోచించడం మానేయండి. అధిక ఒత్తిడి తలనొప్పికి కారణం. ఒత్తిడి, సరిగ్గా తినకపోవడం, నీరు తీసుకోకపోవడం,నిద్ర చక్రాలకు అంతరాయం తలనొప్పికి దారితీస్తాయి..
ఇదీ చదవండి: పచ్చిమిర్చి కళ్లకు, ఎముకలకు ఎంతో ఆరోగ్యకరం.. కానీ, ఇలా తినండి..
ఈ రోజుల్లో పని ఒత్తిడి, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి ఇబ్బంది పెడుతోంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి తాగడం వల్ల తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter