Banana Thickshake Recipe: బనానా మిల్క్ షేక్ పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తీసుకోనే ఆహారం. దీని వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు ఈ షేక్ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా బరువు పెరగాలి అనుకొనేవారు దీని వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో దీని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైన జ్యూస్ ఇది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బనానా షేక్ గురించి:
బనానా షేక్ అనేది పండిన అరటిపండ్లు, పాలు, ఐస్ క్రీం, రుచులు మరియు స్వీటెనర్‌లను కలపడం ద్వారా తయారు అవుతుంది. ఐస్ క్రీం, వెయ్ పౌడర్, ప్రొటీన్ పౌడర్, విప్పింగ్ క్రీం, డ్రై మిల్క్ మొదలైన వివిధ పదార్థాలతో అరటి మిల్క్ షేక్‌లు తయారు చేస్తారు.
మీరు ఈ ప్రాసెస్ చేసిన పదార్థాలన్నింటినీ ప్రత్యేక సందర్భంలో తయారు చేసుకోవచ్చు. బదులుగా ఇంట్లోనే అన్ని సహజమైన అరటిపండు షేక్ చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.మీరు మీ రోజువారీ ఆహారంలో ఫ్యాన్సీ ప్రాసెస్ చేసిన పదార్థాలను పరిమితం చేయాలనుకుంటే, మీరు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అయితే ఆలస్యం చేయకుండా మీరు కూడా దీని ప్రయత్నించండి.
కావలసిన పదార్థాలు:
2 పండిన అరటిపండ్లు
1 గ్లాసు పాలు
1 టేబుల్ స్పూన్ చక్కెర
1/2 టీస్పూన్ వనిల్లా ఎస్సెన్స్
ఐస్ క్యూబ్స్
తయారు చేసే పద్ధతి:
అరటిపండ్లను తొక్క తీసి, ముక్కలుగా చేసుకోవాలి. మిక్సర్ జార్‌లో పాలు, అరటి ముక్కలు, చక్కెర, వనిల్లా ఎస్సెన్స్ వేసి మూత పెట్టి మిక్స్ చేయండి. ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి బ్లెండ్ చేయండి. ఇప్పుడు దీని ఒక గ్లాసులో పోసి, సర్వ్ చేయండి. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.
ఆరోగ్యలాభాలు ఏంటి:
అరటిపండు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. అరటిపండు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే బరువు పెరగాలి అనుకొనే వారు ఈ పండును నేరుగా లేదా షాక్‌గా తయారు చేసుకొని తీసుకోవచ్చు. వేసవిలో లభించే కూల్ డ్రింక్స్ కంటే ఇది చాలా మంచిది అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter