విశాఖ: ఉన్నత స్థాయి ఒత్తిడితో జగన్ హత్యాయ్నం ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం.. అతని చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే నిందితుడు శ్రీనివాస్ జేబులో పోలీసులు ఒక లెటర్‌ను కూడా గుర్తించినట్లు సమాచారం. ఈ లెటర్ ఆధారం చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
దుండగుడు ఈ దాడి పబ్లిసిటీ కోసం చేశాడా..లేదా దాడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వాస్తవానికి ఎయిర్ పోర్టులో ఆయధాలు నిషేదం..అలాంటి షటిష్టమైన సెక్యూరిటీ ఉన్నప్పటికీ నిందితుడు కత్తితో ఎయిర్ పోర్టులోకి ప్రవేశించంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి నిందిడుతు శ్రీనివాస్ ఎయిర్ పోస్టులోని ఓ క్యాంటిన్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు జగన్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారని పక్కా సమాచారంతో ఈ దాడికి స్కెచ్ వేసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతే ఈ దాడి వెనుక కారకులెవరో తేలనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.