Nizamabad News: మహా శివరాత్రి రోజున ఘోర విషాదం.. వైద్యం కోసం వెళుతూ తండ్రీకొడుకులు అనంతలోకాలకు..

Road Accident in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనగా.. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మరణించారు. శివరాత్రి పర్వదినం రోజు తండ్రీకొడుకులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 8, 2024, 05:31 PM IST
Nizamabad News: మహా శివరాత్రి రోజున ఘోర విషాదం.. వైద్యం కోసం వెళుతూ తండ్రీకొడుకులు అనంతలోకాలకు..

Road Accident in Nizamabad: మహా శివరాత్రి పర్వదినాన ఆ ఇంట విషాదం నింపింది. ఒకే ఇంట్లో తండ్రీకులిద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి వైద్యం కోసం బైక్‌పై వెళ్తుండగా.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు శివైక్యమైన సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడిగేలా గేట్, అంక్సాపూర్ గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..

మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన మాడవేడి రవీందర్ (55) అనే వ్యక్తికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. గత రెండేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన కొడుకు మాడవేడి రాజు (22)తో కలిసి శుక్రవారం ఉదయం డయాలసిస్ చేయించుకునేందుకు బైక్‌పై బయలుదేరారు. ఇంటి నుంచి 10 నిమిషాలు ప్రయాణించారో.. లేదో రిపేరీ కారణంగా రోడ్డు పక్కన ఆగి ఆపేసిన లారీని బైక్ బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ఇద్దరు స్పాట్‌లోనే మరణించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండగపూట తండ్రీకొడుకులు ఒకేసారి మరణించడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. 

స్నేహితులే హంతకులు..

ముగ్గురు మిత్రుల మధ్య మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని  ఉల్వనూర్ బంజర్ కుంజా వెంకయ్య గుంపులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉల్వనూర్ బంజర్ కుంజా వెంకయ్య గుంపునకు చెందిన కల్తీ మల్లయ్య, జోగా రాము, పూనెం శివా లు గురువారం రాత్రి కలిసి మద్యం సేవించారు. వీరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. జోగా రాము కర్రతో మల్లయ్య తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. 

మృతదేహాన్ని రాము, శివలు ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మల్లయ్య మృతి చెందినట్లు గ్రామస్థులను నమ్మించారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. మల్లయ్య మృతి అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీనివాస్ పూర్తి స్థాయి కూపీ లాగడంతో హత్యోదంతం వెలుగు చూసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Record Break Movie Review: 'రికార్డ్ బ్రేక్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే.. ?

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News