Apple Juice For Weight Loss: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా తీసుకొనే ఆహారం కారణంగా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు, చెడు కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య వల్ల నచ్చిన ఆహారం, దుస్తులు, పనులను చేయలేకపోతున్నారు.
అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రొడెక్ట్స్‌లను, మందులును ఉపయోగిస్తున్నారు. దీని వల్ల బరువు తగ్గనిన కొత్త సమస్యలకు స్వాగతం పలుకుతున్నారు. ఇలా మందులు, ప్రొడెక్ట్స్‌లను ఉపయోగించకుండా సహజంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యకు యాపిల్ ఎంతో మేలు చేస్తుంది. యాపిల్ నేరుగా తినలేని వారు దీని ప్రతిరోజు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దీని వల్ల బరువుతో పాటు ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. యాపిల్స్ లో ఫైబర్, పెక్టిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బరువు తగ్గడానికిసహాయపడతాయి. ఇవి బరువు తగ్గడానికిసహాయపడతాయి.
యాపిల్ జ్యూ స్ బరువు తగ్గడానికిఎలా సహాయపడుతుంది:
● తక్కు వ కేలరీలు:
ఒక కప్పు యాపిల్ జ్యూ స్ లో సుమారు 100 కేలరీలు ఉంటాయి. ఇది రోజువారీ కేలరీల తీసుకోవడం తగ్గించడానికి సహాయపడుతుంది.
● ఫైబర్:
యాపిల్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కు వసేపు కడుపు నిండినట్లు భావించేలా చేస్తుంది.
● పెక్టిన్:
పెక్టిన్ ఒక రకమైన ఫైబర్, ఇదిజీర్ణక్రియ్రిను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
● యాంటీఆక్సిడెంట్లు:
యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి.
బరువు తగ్గడానికి యాపిల్ జ్యూ స్ ఎలా తాగాలి:
● ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక కప్పు యాపిల్ జ్యూ స్ తాగడం మంచిది.
● భోజనానికిముందు 30 నిమిషాల పాటు ఒక కప్పు యాపిల్ జ్యూ స్ తాగడం వల్ల ఆకలిని తగ్గించుకోవచ్చు.
● మీరు రోజుకు రెండు నుంచి మూడు సార్లు యాపిల్ జ్యూ స్ తాగవచ్చు.
యాపిల్ జ్యూ స్ తాగేటప్పు డు గుర్తుంచుకోవలసిన కొన్ని చిట్కా లు:
● ప్యా కెట్ లో వచ్చే యాపిల్ జ్యూ స్ లో చక్కెర ఇతర కృత్రిమ పదార్థాలు ఉండవచ్చు కాబట్టి వాటిని తాగకుండా ఉండటం మంచిది.
● యాపిల్ జ్యూ స్ తాగడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మంచి ఫలితాలు పొందుతారు.
యాపిల్ జ్యూ స్ తాగడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు:
● కడుపు ఉబ్బరం
● అతిసారం
● గ్యా స్
Also read: Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మహిళలు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook