Vande Bharat Sleeper Trains: నిర్మాణం పూర్తి చేసుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు, త్వరలోనే ప్రారంభం

Vande Bharat Sleeper Trains: వందేభారత్ స్లీపర్ రైళ్లు సిద్ధమయ్యాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులో రానున్నాయి. మూడు వెర్షన్లలో వందేభారత్ రైలు ఉండనుంది. వందేభారత్ స్లీపర్ రైలులో ఉండే సౌకర్యాల గురించి తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2024, 01:39 PM IST
Vande Bharat Sleeper Trains: నిర్మాణం పూర్తి చేసుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు, త్వరలోనే ప్రారంభం

Vande Bharat Sleeper Trains: దేశంలో ఆదరణ పొందుతున్న వందేభారత్ రైళ్లలో మరో వెర్షన్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటి వరకూ పడుకునే సౌకర్యం లోపించడంతో వృద్దులకు అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ఆ అసౌకర్యాన్ని తొలగిస్తూ రైల్వే శాఖ వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఈ రైళ్లలో ఉండే సౌకర్యాలు, ఫీచర్లు ఇలా ఉండనున్నాయి.

వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే ఈ రైళ్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇక కొన్ని పరీక్షల తరువాత అధికారికంగా పట్టాలపై పరుగులు తీయనున్నాయి. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ కార్యక్రమంలో వందేభారత్ స్లీపర్ రైలు కోచ్ ను రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ ఆవిష్కరించారు. వందేభారత్ రైలు ఇకపై మూడు వెర్షన్లలో ఉంటుంది. అందులో ఒకటి వందేభారత్ చైర్ కార్, రెండవది వందేభారత్ మెట్రో, మూడవది వందేభారత్ మెట్రో ఉంటుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లు తయారవుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని బీఈఎంఎల్ రైలు, మెట్రో కలిపి 160 వందేభారత్ స్లీపర్ కోచ్‌లు తయారు చేస్తున్నాయి. 

వందేభారత్ స్లీపర్ రైలు ఇతర రైళ్లతో పోలిస్తే చాలా విశాలంగా ఉంటాయి. రైళ్లో ప్రవేశించే మార్గాన్ని కూడా వెడల్పు చేస్తున్నారు. దాంతో ప్రయాణీకులకు కంఫర్ట్ పెరుగుతుంది. ఇక టాయిలెట్లు కూడా ఆధునిక డిజైన్‌తో రూపుదిద్దుకుంటున్నాయి.  రైళ్లో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. స్లీపర్ కోచ్ సీట్ల కుషన్లను మరింత సౌకర్యవంతంగా, మెత్తగా ఉండేట్టు మారుస్తున్నారు. వైరస్‌ను కూడా 99 శాతం నియంత్రించగలవు. కోచ్‌లో ఆక్సిజన్ సరఫరా మరింత మెరుగ్గా ఉండేట్టు చర్యలు తీసుకుంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా ఇతర ఏసీ రైళ్లలో ఉన్నట్టు కుదుపులు ఉండవు. శబ్దాలు కూడా అస్సలుండవు. ప్రయాణీకుల సౌకర్యార్ధం అనేక సౌకర్యాలు తీసుకుంటోంది రైల్వే శాఖ. లోపలి ఇంటీరియర్ కూడా చాలా ఆహ్లదంగా, అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే రైలు కోచ్‌ల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. మొదటి వందేభారత్ స్లీపర్ రైలును 5-6 నెలలు పరీక్షించిన తరువాతే దేశవ్యాప్తంగా వందేబారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభిస్తామన్నారు. స్లీపర్ కోచ్ రైళ్లు కూడా వందేభారత్ ఠైర్ కార్ టెక్నాలజీతోనే నడవనున్నాయి. 

Also read: Miss World 2024: మిస్ వరల్డ్ 2024 కిరీటం గెల్చుకున్న చెక్‌ రిపబ్లిక్‌ భామ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News