Samsung Galaxy S23 Fe 5G Price Cut: అమెజాన్‌లో అదరిపోయే డిస్కౌంట్‌..Galaxy S23 FE మొబైల్‌ కేవలం రూ. 3* వేల లోపే పొందండి..

Samsung Galaxy S23 Fe 5G Price Cut: అతి తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు. అమెజాన్‌లో SAMSUNG Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 17, 2024, 01:04 PM IST
Samsung Galaxy S23 Fe 5G Price Cut: అమెజాన్‌లో అదరిపోయే డిస్కౌంట్‌..Galaxy S23 FE మొబైల్‌ కేవలం రూ. 3* వేల లోపే పొందండి..

Samsung Galaxy S23 Fe 5G Price Cut: భారతదేశ వ్యాప్తంగా సాంసంగ్ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది.  దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో కూడిన మొబైల్స్ ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన SAMSUNG Galaxy S23 FE 5G స్మార్ట్ ఫోన్‌కి మంచి ప్రజాదరణ లభించింది. ఇది ప్రీమియం సెగ్మెంట్లో అతి శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన కొత్త కలర్స్‌లో లభించడం వల్ల చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మీరు కూడా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక డీల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరలోనే ఈ కొత్త సాంసంగ్ మొబైల్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..

ప్రస్తుతం అమెజాన్ లో ఈ సాంసంగ్ Galaxy S23 స్మార్ట్ ఫోన్ ఆరు కలర్స్‌లో, ఒక స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర MRP రూ.79,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 48 శాతం తగ్గింపుతో కేవలం రూ.41,384కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలని అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి ఈ ఆఫర్స్ వినియోగించడానికి బ్యాంకు క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. 

బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. వన్ కార్డు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.2వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు, బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా ఈ మొబైల్ ను మరింత తగ్గింపుతో పొందడానికి ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ కొత్త SAMSUNG Galaxy S23 FE 5G స్మార్ట్ ఫోన్‌ను రూ. 39,384కే పొందవచ్చు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

సాంసంగ్ గెలాక్సీ S23 స్మార్ట్ ఫోన్ టాప్‌ 10 ఫీచర్స్‌:
పెద్ద డిస్ప్లే: 6.1-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది.
శక్తివంతమైన ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Gen 2 లేదా Exynos 2300 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
మెరుగైన కెమెరాలు: 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెటప్‌లో అందుబాటులో ఉంది.
40MP సెల్ఫీ కెమెరా: 4K వీడియో రికార్డింగ్‌తో లభిస్తోంది.
పెద్ద బ్యాటరీ: 4000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది. 
5G కనెక్టివిటీ: 5G SA/NSA కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. 
Wi-Fi 6E: వేగవంతమైన Wi-Fi కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. 
Android 13: తాజా Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. 
One UI 5.0: సాంసంగ్ తాజా కస్టమ్ UIతో లభిస్తోంది. 
IP68 వాటర్ రెసిస్టెన్స్: నీటిలో మునిగిపోయినప్పటికీ ఫోన్‌ పడవ్వకుండా వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News