Loksabha Elections Impact: దేశంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచర్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రభావం దేశవ్యాప్తంగా జరిగే వివిధ పరీక్షలపై ప్రభావం చూపించనుంది.
లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సరిగ్గా ఎన్నికల సమయంలోనే సీఏ పరీక్షలు ఉండటంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పరీక్షల్ని వాయిదా వేసింది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను మార్చ్ 19న జారీ చేయనుంది. వాస్తవానికి ఈ పరీక్షలు మే, జూన్ నెలల్లో జరగాల్సి ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ EAPCET పరీక్షలపై ప్రభావం
కేవలం సీఏ పరీక్షలే కాకుండా ఇంకా ఇతర పరీక్షలు కూడా వాయిదా పడవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉంది. అదే రోజు ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మే 9 నుంచి 12 వరకూ తెలంగాణ EAPCET పరీక్షలు షెడ్యూల్ అయ్యాయి. అటు ఏపీలో EAPCET పరీక్షలు మే 13 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ పరీక్షల్ని వాయిదా వేసే పరిస్థితి కన్పిస్తోంది.
మరోవైపు తెలంగాణ ఐసెట్ పరీక్షలు జూన్ 4,5 తేదీల్లో జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండటంతో ఈ పరీక్షల తేదీ కూడా మారవచ్చు. ఇక ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో నియామకాల పరీక్షలు మే 9,10,13 తేదీల్లో జరగనున్నాయి. ఇవి కూడా వాయిదా పడవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా జేఈఈ 2024 అడ్వాన్స్ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. ఈ పరీక్ష కూడా వాయిదా పడవచ్చని సమాచారం.
Also read: Aadhaar Card: ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వినియోగించారో ఇలా తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook