BJP MP Ticket: అధికారమే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటు అధికారికంగా జరిగినా ఇంకా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కబడలేదని తెలుస్తోంది. దానికి నిదర్శనంగా పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు, పది అసెంబ్లీ సీట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందనే అభిప్రాయం అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలో దిగేందుకు బీజేపీ ఏపీ నాయకులు పోటీపడుతున్నారు. వీరి మధ్యలో పరిపూర్ణానంద స్వామి చేరారు. హిందూపురం వేదికగా జరిగిన ఓ సభలో స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి 'జయహో హిందూపురం' పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పరిపూర్ణానంద బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్ కూడలిలో జరిగిన బహిరంగ సభలో పరిపూర్ణ స్వామి మాట్లాడారు. 'హిందూపురం అభివృద్ధి కోసమే నేను అడుగు పెట్టా. ఎవరు ఎన్ని చెప్పినా నాకు ఎంపీ టికెట్ ఖాయం' అని ప్రకటించారు.
Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?
ఈ సందర్భంగా తన అభిమానులు, అనుచరులకు కీలక సూచనలు చేశారు. 'సోషల్ మీడియా, టీవీల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దు. మరో రెండు రోజుల్లో మంచి శుభవార్త చెబుతా. హిందూపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి' అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తాను నిరంతరం పాటుపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. తన స్వార్థం కోసం పోటీ పడడం లేదని స్పష్టం చేశారు. తనకు కచ్చితంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం తప్పకుండా అవకాశం కల్పిస్తుందని పరిపూర్ణానంద స్వామి ధీమా వ్యక్తం చేశారు.
రేసులో సీనియర్లు
పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు లభించాయి. అరకు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, ఏలూరుతోపాటు హిందూపురం కూడా ఉంది. ఏపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు పార్టీ నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోసార కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రులయ్యే అవకాశం ఉండడంతో ఎంపీ సీట్లు హాట్‌హాట్‌గా మారాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం సీటు మరింత ఆసక్తికరంగా ఉంది.
బీసీ బలం అధికంగా ఉన్న.. టీడీపీ బలంగా ఉన్న హిందూపూర్ స్థానంలో బరిలో దిగేందుకు పెద్ద ఎత్తున నాయకులు పోటీ పడుతున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నాయకులు సత్య కుమార్, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అధిష్టానానికి వినతులు కూడా ఇస్తున్నారు. అయితే హిందూత్వ అజెండా చెప్పుకుని పరిపూర్ణానంద స్వామి రేసులోకి వచ్చారు. అయోధ్య, మోదీ చరిష్మాను నమ్ముకున్న పరిపూర్ణానంద స్వామి తాను చేసే హిందూత్వ కార్యక్రమాలు తనకు గెలుపు అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. మరి బీజేపీ మదిలో ఏముందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook