Betel Leaves Amazing Benefits: ఈ వ్యాధులున్నవారు రోజు ఒక్కటైన తమలపాకును తినండి.. ఎందుకంటే!

Betel Leaves Amazing Benefits: ప్రతి రోజు తమలపాకును తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. దీని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 22, 2024, 04:34 PM IST
Betel Leaves Amazing Benefits: ఈ వ్యాధులున్నవారు రోజు ఒక్కటైన తమలపాకును తినండి.. ఎందుకంటే!

 

Betel Leaves Amazing Benefits: మన పూర్వీకులు తమలపాకును ఎక్కువగా నమిలివారు. క్రమంగా ఈ ఆకులను నమిలే వార సంఖ్య పెరిగింది. ఇక అప్పటి నుంచి పాన్‌ షాపులు పుట్టుకు వచ్చాయి. ప్రతి రోజు తమలపాకును తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు కూడా లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు మధుమేహం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ తమల పాకులు ప్రభావంతంగా సహాయపడతాయి. ఇవే కాకుండా ఇందులో ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

తమలపాకును నీటిని నానబెట్టి వాటిని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ వాటర్‌లో  లభించే ఔషధ గుణాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా  కఫం నుంచి కూడా విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సీజన్‌ వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు తమల పాకులను నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

తమలపాకు కషాయం:
తమలపాకు కషాయం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా తమలపాలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని రెండు కప్పు నీటిలో వేసుకుని మరిగించుకుని తాగితే బోలెడు లాభాలు కలుగుతాయి.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
తమలపాకు నీటిని ప్రతి రోజు తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధితో బాధపడేవారు తప్పకుండా తమలపాకు నీటి తాగాల్సి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మలబద్ధకం నుంచి విముక్తి:
మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తమలపాకు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ నీటిలో లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు దగ్గు, పిత్త సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా గొంతు వాపును, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచండి:
తరచుగా చాలా మంది వాంతులతో పాటు విరేచనాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు తమలపాకు కషాయం తాగడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News