Roasted Chana Benefits : వేయించిన శనగలతో వేయి లాభాలు.. పిడికెడు తింటే పురుషులకు దివ్యౌషధం..

Benefits of Roasted Chana:వేయించిన శనగలతో వేయి లాభాలు ఉంటాయి. మీరు నమ్మలేరు కాని ఇందులో ఉండే పోషకాలతో ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా ఇది పురుషులకు ఆరోగ్యనిధి. ఇందులో ఉండే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 23, 2024, 11:16 AM IST
Roasted Chana Benefits : వేయించిన శనగలతో వేయి లాభాలు.. పిడికెడు తింటే పురుషులకు దివ్యౌషధం..

Benefits of Roasted Chana:వేయించిన శనగలతో వేయి లాభాలు ఉంటాయి. మీరు నమ్మలేరు కాని ఇందులో ఉండే పోషకాలతో ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా ఇది పురుషులకు ఆరోగ్యనిధి. ఇందులో ఉండే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

శనగలను ప్రసాదంలోకి మన పురాతన కాలం నుంచి వినియోగిస్తారు. అయితే, ఆరోగ్యపరంగా కూడా ఈ శనగలతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వేయించిన శనగాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పేగు ఆరోగ్యంగా బాగుంటుంది. అంతేకాదు, వేయించిన శనగలను మన డైట్లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇందులో పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ప్రోటీన్లు ఉంటాయి. శనగల్లోని ఫైబర్ వల్ల మనకు ఎక్కుస సమయం ఆకలిగా ఉండదు. కడుపు నిండు అనుభూతి కలుగుతుంది. దీంతో బరువు పెరగరు. ముఖ్యంగా ఈ శనగలతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.

గర్భిణులకు కూడా వేయించిన శనగలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు. ఒత్తిడితో బాధపడేవారికి ఇది ఎంతో ఆరోగ్యకరం. వేయించిన శనగలు గర్భిణులు తినడం వల్ల కడుపులో ఉన్న బిడ్డపై కూడా ప్రభావం చూపుతుంది. వేయించిన శనగలు తినడం వల్ల గర్భిణులకు వాంతి అనుభూతి కూడా కలుగదు. వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కేవలం గర్భిణులకు మాత్రమే కాదు సాధారణ ఆడవారికి కూడా వేయించిన శనగలతో వేయి లాభాలు ఉంటాయి. సాధారణంగా ఆడవారు వెన్నునొప్పి సమస్యతో బాధపడతారు. వీళ్లు కూడా తమ డైట్లో వేయించిన శనగలు చేర్చుకోవాలి. రోజుకు రెండు పూటల వేయించిన శనగలను తింటే వెన్నునొప్పి సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఇదీ చదవండి:  పుచ్చకాయను సగం కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..

వేయించిన శనగలు తింటే మన ఎముకలు బలోపేతమవుతాయి. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతుంది. వేయించిన శనగలతో మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వేయించిన శనగల్లో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది. వేయించిన శనగలు డయాబెటిస్ తో బాధపడేవారికి కూడా ఆరోగ్యకరం రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మగవారికి ఎంతో మేలు చేస్తాయి శనగలు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తిని, గ్లాసు పాలు తాగితే ఆరోగ్యకరం, బలవర్థకంగా మారుతుంది.

ఇదీ చదవండి: సద్దురు జగ్గీ వాసుదేవ్‌కు మెదడులో రక్తస్రావంతో సర్జరీ.. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

అంతేకాదు వేయించిన శనగలు తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. అధిక బరువుతో బాధపడేవారు తమ డైట్లో వేయించిన శనగలను చేర్చుకుంటే శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించేస్తుంది. ముఖ్యంగా శరీరంలో అలసట ఎక్కువగా అనుభూతి చెందేవారు వేయించిన శనగలను తప్పకుండా తినాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News