GATE 2024: గేట్ 2024 స్కోరు కార్డులు, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

GATE 2024: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే గేట్ 2024 తుది ఫలితాలు, మార్కులు విడుదలయ్యాయి. గేట్ పరీక్ష రాసిన అభ్యర్ధులు మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకుని స్కోర్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2024, 07:25 PM IST
GATE 2024: గేట్ 2024 స్కోరు కార్డులు, కటాఫ్ మార్కులు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

GATE 2024: దేశవ్యాప్తంగా ఐఐటీ సహా ప్రముఖ ఇనిస్టిట్యూట్లలో ఎంటెక్, పీహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. బెంగళూరు ఐఐఎస్సీ ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించగా ఇవాళ తుది ఫలితాలు విడుదలయ్యాయి. 

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 200 నగరాల్లో గేట్ 2024 పరీక్షలు జరిగాయి. బెంగళూరు ఐఐఎస్సీ ఈ పరీక్ష నిర్వహించింది. ఫిబ్రవరి 19వ తేదీన ప్రైమరీ కీ విడుదల కాగా ఫిబ్రవరి 22 నుంచి 25 వరకూ కీ అభ్యంతరాలు స్వీకరించింది. మార్చ్ 15న ఫైనల్ ఆన్సర్ కీ, మార్చ్ 16న ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవాళ కటాఫ్ మార్కులతో పాటు తుది ఫలితాలతో కూడిన స్కోరు బోర్డును విడుదల చేసింది బెంగళూరు ఐఐఎస్సీ. దేశంలోని ముంబై, ఢిల్లీ, గువహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలతో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డి ప్రవేశాలు గేట్ 2024 పరీక్ష ఆధారంగానే ఉంటాయి. ప్రభుత్వ విద్యాసంస్థలే కాకుండా ఇతర ప్రైవేట్ యూనివర్శిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటాయి. 

గేట్ పరీక్ష ద్వారానే ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి. అంతేకాకుండా గేట్ పరీక్షలో లభించిన స్కోరు మూడేళ్ల వరకూ వర్తిస్తుంది. గేట్ 2024 తుది ఫలితాలు, స్కోరు కార్డులను అధికారిక వెబ్‌సైట్ gate2024.iisc.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీ మార్కుల వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. 

Also read: Xiaomi Civi 4 Pro: ప్రపంచంలో మొదటిసారిగా రెండు సెల్ఫీ కెమేరాలతో షియోమీ ఫోన్ లాంచ్, ధర ఎంతంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News