Gujarat Titans Won: ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బోల్తా పడగా.. గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై జట్టును ఆరు పరుగుల తేడాతో గుజరాత్ ఓడించింది. సారథిగా శుభ్‌మన్ గిల్ తొలి విజయాన్ని పొందగా.. ముంబైకి కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్ పాండ్యా పరాజయం పొందాడు. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి గుజరాత్ 168 పరుగులు సాధించింది. మోస్తరు లక్ష్యాన్ని ఛేదనకు దిగిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది.
Also Read: Nitish Rana: రెచ్చగొడితే రచ్చరచ్చే.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన బౌలర్‌కు భారీ జరిమానా
రెండో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ తడబడుతూ పరుగులు రాబట్టింది. ఓపెనర్లుగా దిగిన వృద్ధిమాన్ సాహ (19), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31) మంచి ఆరంభం ఇచ్చారు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సాయి సుదర్శన్ 45 (39 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తా చాటాడు. రాహుల్ తెవాటియా (22), అజ్మాతుల్లా ఒమర్‌జాయ్ (17), డేవిడ్ మిల్లర్ (12) మోస్తరు స్కోర్ సాధించారు. ముంబై బౌలర్లు బంతితో గుజరాత్‌ను స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. ప్రారంభం నుంచి ఒక ప్రణాళికతో బౌలింగ్ వేసిన ముంబై గుజరాత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. జస్ప్రీత్ బుమ్రా తనదైన బౌలింగ్‌తో మూడు వికెట్లు తీశాడు. గెరాల్డ్ కాట్జీ రెండు, పీయూష్ చావాల్ల ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: IPL 2024 SRH vs KKR: క్షణాల్లో మారిన సీన్, పాపం కావ్య పాప..సోషల్ మీడియాలో వైరల్
సాధారణ స్కోర్‌ను చేధించేందుకు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగు కూడా తీయకుండానే మైదానం వీడాడు. డేవాల్డ్ బ్రెవిస్ 38 బంతుల్లో 46 పరుగులు), మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (43) దీటుగా ఆడి జట్టు విజయతీరం వైపుకు తీసుకెళ్లారు. నమన్ ధిర్ (20) , హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ (25) బ్యాట్‌తో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. టాపార్డర్ చక్కదిద్దిన ఇన్నింగ్స్‌ను మిడిలార్డర్ ముందుకు తీసుకెళ్లలేకపోయింది. వరుస వికెట్లు పడుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్‌లో దీటుగా ఆడి జట్టుకు విజయవకాశాలు మెరుగుపర్చాడు. కానీ తర్వాతి బంతికి క్యాచ్ ఇచ్చేసి మైదానం వీడడంతో ముంబై పరాజయం మూటగట్టుకుంది.
మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గుజరాత్ బౌలర్లు మొదట విఫలమయ్యారు. పవర్ ప్లేతోపాటు మిగతా ఓవర్‌లలో కూడా భారీగానే పరుగులు ఇచ్చారు. కానీ మ్యాచ్ ముగుస్తున్న సమయంలో బౌలర్లు రెచ్చిపోయి ముంబైపై విరుచుకుపడ్డారు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టగా.. రవి శ్రీనివాసన్ సాయి కిశోర్ ఒక వికెట్ తీశాడు.
ఓటమి విజయాల పరంపర
ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో జట్టు ఓడిపోవడం ముంబై అభిమానులకు నిరాశపర్చింది. సొంత మైదానంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా సీజన్ ప్రారంభంలో విజయం సాధించడం గుజరాత్‌కు హ్యాట్రిక్ కాగా.. తొలి మ్యాచ్ ఓడిపోవడం ముంబైకి ఆనవాయితీగా వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి