సీపీఐ కార్యవర్గం భేటీ; మహాకూటమిలో కొనసాగే అంశంపై మంతనాలు

                                          

Last Updated : Nov 9, 2018, 06:57 PM IST
సీపీఐ కార్యవర్గం భేటీ; మహాకూటమిలో కొనసాగే అంశంపై మంతనాలు

హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ భేటీలో సీపీఐ జాతీయ ప్రధాన కాదర్యదర్శి సువవరంతో పాటు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.  సీట్ల కేటాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ తీరుపై  అసంతృప్తితో ఉన్న సీపీఐ పార్టీ ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనుంది.

మహాకూటమిలో భాగంగా మొదట్లో 15 సీట్లు డిమాండ్ చేసిన సీపీఐ ..ఆ తర్వాత 12.....9....5 ఇలా తగ్గించుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ మాత్రమే మూడు సీట్లు మాత్రమే సీపీఐకి కేటాయించింది. సీపీఐకి వైరా, హుస్సాబాద్ , బెల్లంపల్లి స్థానాలతో పాటు రెండు ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఈ సందర్భంగా తమకు ఒక ఎమ్మెల్సీ స్థానంతో పాటు నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని .. అవి కూడా తాము కోరినటువంటి హస్నాబాద్, కొత్తగూడెం, వైరా, దేవరకొండ, బెల్లంపల్లి లేద మంచిర్యాల ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది.

సీపీఐ డిమాండ్ పై ఇప్పటి వరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరం సమవేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో మహాకూటమిలో కొససాగే అంశంపై సీపీఐ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Trending News