Holidays in April 2024 April Month Festivals And Bank Holidays: మనలో చాలా మంది కొత్త నెల స్టార్ట్ అవుతుందటే మొదటగా ఆ నెలలో ఎన్నిరోజులు సెలవులు ఉన్నాయి. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడికి వెళ్లోచ్చు అనేదాని గురించి ప్లాన్ లు చేస్తుంటారు. ఇక.. అసలు సమ్మర్ లో ఒక రేంజ్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈక్రమంలో..కాలేజీలకు ఈరోజునుంచి మార్చి 31 నుంచి మే 31 వరకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. దీంతో ముఖ్యంగా ఉదోగస్థులు.. ఫెస్టివల్స్, శనివారం, ఆదివారం వచ్చేలా చూసుకోని తమ టూర్లకు ప్లాన్ లు వేసుకుంటారు.
ఉగాది పర్వదినం ఏప్రిల్ 9
ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 9 న ఉగాది పర్వదినం వచ్చింది. ఇది హిందువులకు ప్రధానమైన పండుగ. ఈరోజున పంచాంగ శ్రవణం చేస్తారు. అదే విధంగా.. ఉగాదిపచ్చడిని చేసుకుని తమ వారితో కలిసి తింటారు. ఈ పచ్చడిలో ఆరురుచులు ఉంటాయి. తీపి, చెదు, వగరు, కారం, ఉప్పు, పులుపులతో పచ్చడి తయారుచేస్తారు.ఉగాదిని ఒక్కొ ప్రాంతంలో ఒక్కొ పేరుతో పిలుచుకుంటారు.
ఏప్రిల్ 5 ఏకాదశి..
ఈసారి ఏప్రిల్ 5 న ఏకాదశి వచ్చింది. ఇది విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన తిథి. శ్రీమన్నరణుడిని భక్తితో కొలిస్తే మనస్సులోని కోరికలు నెరవేరుతాయి.
ఏప్రిల్ 10 ఈదుల్ ఫితర్..
ఏప్రిల్ పదవ తేదీన ఈదుల్ ఫితర్ రంజాన్ ను జరుపుకుంటారు. ఈరోజున ముస్లింసోదరులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈరోజు పాయసం(ఖీర్) చేసి అందరిని ఇంటికి ఆహ్వానిస్తారు
ఏప్రిల్ 17 శ్రీరామనవమి..
ఈసారి శ్రీరామ నవమిని ఏప్రిల్ 17 న వచ్చింది.ఈరోజు ప్రజలంతా రాములవారిని భక్తితో కొలుచుకుంటారు. అనేక ప్రాంతాలలో రాముల వారి కళ్యాణంను నిర్వహిస్తారు.
ఏప్రిల్ 21 మహావీర్ జయంతి.
వర్ధమాన వీరుడిని జయంతి జైనులు వేడుకగా జరుపుకుంటారు.
ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి..
దేశంలో ప్రతిఊరు, ప్రతివాడవాడలా.. హనుమాన్ యాత్రలను నిర్వహిస్తారు. భారీగా హానుమాన్ విగ్రహాలను ఊరేగిస్తూ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తు తమ భక్తిని చాటుకుంటారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తంగా చూస్తే 14 రోజులపటు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఇండియా క్యాలెంటర్ ప్రకారం.. ఈ సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 1, వార్షిక అకౌంట్ క్లోజింగ్ డే.. దీంతో బ్యాంకులకు హలీడే. ఏప్రిల్ 5 బాబు జగ్జీవర్ రామ్ జయంతి. ఏప్రిల్ 13 రెండో శనివారం, ఏప్రిల్ 27 నాలుగవ శనివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.
అదే విధంగా.. ఏప్రిల్ మాసం.. 3, 10,17,24,31 తేదీలలో ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయి. ఈ క్రమంలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నకూడా ఆన్ లైన్ సర్వీసులు మాత్రం యథా ప్రకారం కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook