CM Jagan Mohan Reddy: పక్కా స్కెచ్‌తో సీఎం జగన్‌పై దాడి.. అందుకే ఆ ప్లేస్ నుంచి..!

Stone Attack On CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఏపీపీసీసీ అధక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే దాడికి పాల్పడ్డారని మంత్రి రోజా అన్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

Written by - Ashok Krindinti | Last Updated : Apr 14, 2024, 10:48 AM IST
CM Jagan Mohan Reddy: పక్కా స్కెచ్‌తో సీఎం జగన్‌పై దాడి.. అందుకే ఆ ప్లేస్ నుంచి..!
Live Blog

Stone Attack On CM Jagan Mohan Reddy Live Updates: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై రాయి ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రిపై ఆకతాయిలు దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయి విసిరారు. వేగంగా దూసుకువచ్చని రాయి.. సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. జగన్‌పై క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం దెబ్బ తగిలింది. బస్సులోనే సీఎం జగన్‌కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. చికిత్స తరువాత సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగించారు. టీడీపీ వర్గాలే ఈ దాడికి పాల్పడ్డాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
 

14 April, 2024

  • 10:48 AM

  • 10:42 AM

    CM Jagan Mohan Reddy News Live Updates: "జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య.. జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కానీ ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య చట్టరీత్యా నేరం.. పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను." అని మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేశారు.

     

  • 09:16 AM

    CM Jagan Mohan Reddy News Live Updates: సీఎం జగన్‌పై పక్కా స్కెచ్ వేసుకుని దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివేకానంద స్కూల్‌కు, గంగానమ్మ గుడికి మధ్య ఉన్న చెట్లు దగ్గర నుంచి దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ పూర్తిగా చీకటిగా ఉండడం.. చెట్లు ఉండడంతో నిందితుడు కనిపించలేదు. దాడికి పాల్పడి.. అక్కడి నుంచి ఈజీగా ఎస్కేప్ కావచ్చని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. 30 అడుగుల దూరం నుంచి బలంగా రాయిని విసిరినట్లు తెలుస్తోంది.

  • 08:39 AM
  • 08:36 AM

    CM Jagan Mohan Reddy News Live Updates: విజయవాడ సింగ్ నగర్‌లోని పాఠశాల వద్దకు రాగానే సీఎం జగన్‌పై దాడి నిందితులు దాడి చేసినట్లు తెలుస్తోంది. స్కూల్‌లోని ఓ ఫ్లోర్లో నక్కి.. జగన్ రాగానే రాయి విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఎవరైనా గ్రూప్ కాల్స్ మాట్లాడారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
     

  • 08:34 AM

    CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.
     

  • 08:26 AM

    CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై దాడి ఘటన గురించి ఎన్నికల సంఘం ఈసీ ఆరా తీసింది. విజయవాడ సీపీ కాంతి రాణాకి ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. రేపటిలోగా ఘటనపై నివేదిక పంపాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డవారిని త్వరగా గుర్తించాలన్నారు. 
     

  • 23:48 PM

    CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. "ఎన్నికల కమిషన్‌ను నేను అభ్యర్థిస్తున్నాను. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులైన అధికారులను శిక్షించాలి." అని ట్వీట్ చేశారు.

  • 23:37 PM
  • 23:35 PM

  • 23:28 PM

    CM Jagan Mohan Reddy News Live Updates: సీఎం జగన్‌ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

     

  • 23:26 PM

    CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌ మోహన్ రెడ్డి రాయి దాడి కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో కోడికత్తి 2.0కి తెర లేపారని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంట్ తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా..? అని ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడేనని అన్నారు. డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజీ నేతృత్వంలో రూపొందించిన డ్రామా ఇది అని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందుకు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామాకు, సింగ్ నగర్‌లో సీఎంపై  జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోని జగన్ అండ్ కో పేర్నినాని, అంబటి రాంబాబు లైన్‌లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా..? అని అడిగారు. ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని.. కాలం చెల్లిన ఇటువంటి డ్రామాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు.

  • 23:13 PM

    CM Jagan Mohan Reddy Live Updates: "ఖబర్దార్ చంద్రబాబు.. విజయవాడలో జగనన్నపై దాడి చేసిన పచ్చ గూండాలు! మేమంత సిద్ధం యాత్ర ప్రజాదరణను ఓర్వలేక విజయవాడలో జగనన్న దాడి చేయించిన చంద్రబాబు. నువ్వు నీచుడివని తెలుసు, మరీ ఇంత నీచుడివని తెలియదు చంద్రబాబు! జగనన్న వెనుక కోట్లాది సైన్యం ఉంది, వారి చప్పుడు నీ గుండె ఆగిపోద్ది.." అని దేవినేని అవినాష్ ట్వీట్ చేశారు. 
     

  • 23:12 PM

    CM Jagan Mohan Reddy Live Updates: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. 

  • 23:02 PM

    CM Jagan Mohan Reddy Live Updates: "సీఎం వైఎస్ జగన్‌ గారికికి వ‌స్తున్న ఆద‌రణ చూసి ఓర్వ‌లేక విజ‌య‌వాడ‌లో ఆయ‌న‌పై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పిరికిపంద‌లు. నేడు వారు విసిరిన రాళ్ళే ఓట్లుగా మారి మే 13న వారిని కోలుకోలేని దెబ్బ‌తీస్తాయి. నేరుగా ఎదుర్కోవ‌డం చేత‌గాని ఇలాంటి వారికి రాజ‌కీయాలు ఎందుకు..?" అని మంత్రి రోజా ప్రశ్నించారు. 

     

  • 23:00 PM

    CM Jagan Mohan Reddy Live Updates: "ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఎడమకంటిపైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరు కచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ గారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.." అని ఏపీపీసీసీ అధక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు.

     

  • 22:58 PM

    CM Jagan Mohan Reddy News Live Updates: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. "మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త వైఎస్ జగన్ అన్నా. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల కమిషన్  కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను.." అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

     

Trending News