Rashmika Mandanna Srivalli: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించిన అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటన కి గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
ఈ సినిమాకి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ పైన కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది, ఇందులోని పాత్రలు ఎరా మారబోతున్నాయి అంటూ ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పుష్ప 1 లో కూడా శ్రీ వల్లి పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక మందన్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న ను మరొకసారి వెండి తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర చనిపోతుంది అంటూ గతంలో రూమర్స్ వినిపించాయి కానీ చిత్ర బృందం మాత్రం వీటిపై రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ రష్మిక కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
"ఈ సినిమాలో నా పాత్ర చాలా చాలెంజింగ్ గా ఉంటుంది. మొదట పుష్ప సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అసలు సినిమా ఎలా ఉంటుంది, శ్రీవల్లి పాత్రను ఎలా చూపిస్తారు అనే విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం నా క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్ర 2.0 వర్షన్ ని చూస్తారు" అని చెప్పింది ఈ నేషనల్ క్రష్ రష్మిక.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్ల పాత్రల మధ్య కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పనులతో చిత్ర బృందం బిజీ గా ఉంది. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అలాగే శ్రీవల్లి పాత్ర కొత్త పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..
Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్.. హెలికాప్టర్ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter