Araku Parliament Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం రంగంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను నిత్యం కలుస్తూ.. తమకే ఓటు వేయాలంటూ కోరుతున్నారు. గెలుపు తమదంటే తమదంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గం మూడు జిల్లాల్లో విస్తరించి.. దేశంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడ బరిలో ఎవరు ఉన్నారు..? గెలుపు లెక్కలు ఎలా ఉన్నాయి..? ఈ స్పెషల్ స్టోరీపై ఓ లుక్కేయండి.
అరకు పార్లమెంట్లో సీనియర్, జూనియర్ మధ్య పోటీ నెలకొంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత బరిలో ఉండగా.. అధికార వైసీపీ నుంచి శెట్టి తనూజ రాణి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఒకసారి అరకు ఎంపీగా చేసిన కొత్తపల్లి గీత.. రెండోసారి అరకు పార్లమెంట్ బరిలోకి దిగుతున్నారు. వైసీపీ కొత్త అభ్యర్థిని పోటీకి నిలబెట్టింది. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు, డాక్టర్ శెట్టి తనుజా రాణి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.
Also Read: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటే
అరకు లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009 ఈ లోక్‌సభ ఏర్పడగా.. కాంగ్రెస్ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గెలిచి.. ఈ నియోజకవర్గం నుంచి తొలి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపల్లి గీత.. 91,398 వేల మెజార్టీతో గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొడ్డేటి మాధవి.. 2,24,089 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయించలేదు.
బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత.. ఈసారి కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నారు. గిరిజన గ్రామాలను తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. గిరిజనులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. ఓటర్లతో మమేకం అవుతున్నారు. తాను ఎంపీగా గెలిస్తే.. అరకు రూపురేఖలు మారుస్తానంటూ హామీలు ఇస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీ గొట్టేటి మాధవి స్థానంలో ముందుగా భాగ్యలక్ష్మికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఆమెకు టికెట్ ఖాయమనుకోగా.. చివరి నిమిషంలో తనూజ రాణి పేరు తెరపైకి వచ్చింది. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ కోడలు కావడం.. వైద్యురాలుగా స్థానికంగా పేరు ఉండడంతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని వైసీపీ అభ్యర్థి శెట్టి తనూజ రాణి ధీమాతో ఉన్నారు.
ఒకవైపు రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్నకొత్తపల్లి గీత.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనూజ రాణి మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడంపై కొత్తపల్లి గీత విజయ అవకాశాలు ఆధారపడి ఉండగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే తనూజ రాణి నమ్మకం పెట్టుకున్నారు. సీనియర్ Vs జూనియర్ మధ్య పోరులో అరకు ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి.
Also Read: Glenn Maxwell: ఆర్సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్లో ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook