Beheading Case: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్ధి తోట త్రిమూర్తులుకు షాక్ తగిలింది. 27 ఏళ్ల నాటి కేసులో కీలకమైన తీర్పు వెలువడింది. అప్పట్లో సంచలనం రేపిన శిరోముండనం కేసులో విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్సీ అత్యాచార కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
మరో నెల రోజుల్లో ఎన్నికనగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు షాకింగ్ పరిణామం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట అసెంబ్లీ అభ్యర్ధి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు షాక్ తగిలింది. 27 ఏళ్ల క్రితం అంటే 1996 డిసెంబర్ 29వ తేదీన రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని వెంకటాయపాలెంలో దళితులను శిరోముండనం చేసిన ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఐదుగురు దళితుల్ని హింసించి ఇద్దరికి శిరోముండనం చేయించినట్టుగా తోట త్రిమూర్తులుపై ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చింది. 1996 నుంచి ఇప్పటి వరకూ 150 సార్లు ఈ కేసులో విచారణ జరిగింది.
ఈ కేసులో తోట త్రిమూర్తులును విశాఖపట్నం ఎస్సీ , ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యక కోర్టు దోషిగా ఖరారు చేసింది. 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. 1996లో జరిగిన కేసుకు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తెరపడినట్టయింది. తోట త్రీమూర్తులు ప్రస్తుతం మండపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. జైలు శిక్ష రెండేళ్ల కంటే తక్కువే ఉండటంతో ఎన్నికల్లో పోటీకు ఇబ్బంది తలెత్తకపోవచ్చు.
Also read: AP SSC Results 2024: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది, ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook