వర్థమాన తమిళ సినీ నటి ఆత్మహత్య..!

   

Last Updated : Nov 29, 2018, 01:14 PM IST
వర్థమాన తమిళ సినీ నటి ఆత్మహత్య..!

కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం లాంటి తమిళ చిత్రాలలో నటించిన వర్థమాన సినీ నటి రియామికా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నాళ్లు ఈమె తన సోదరునితో కలిసి  వలసారవాకం ప్రాంతంలో ఓ అద్దెంట్లో నివసిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆమె సోదరుడు ఇంటికి వచ్చి చూడగా.. తలుపుకి గడియపెట్టి తాళం వేసి ఉంది. తనకు అనుమానం వచ్చి.. తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపు తీసి.. ఆయన లోపలికి వెళ్లి చూడగా రియామిక తన బెడ్రూంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతానికి వచ్చి.. మృతదేహాన్ని పంచనామా  నిమిత్తం రోయపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఈ ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని.. ఘటనా స్థలిలో ఎలాంటి సుసైడ్ నోట్ దొరకలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు  అయితే ఇంకా ఏమీ తెలియలేదని చెప్పారు. 

చెన్నై సమీపంలోని శ్రీదేవికి కుప్పం ప్రాంతానికి చెందిన రియామిక ఉన్నత చదువులు చదివారు. చలనచిత్ర రంగంపై ఆసక్తితో ఆమె కోలీవుడ్‌కు వచ్చారు. 26 సంవత్సరాల వయసు గల రియామిక పలు యాడ్స్‌లో కూడా నటించారు.  ఆమె ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉందని పలువురు చెప్పడం గమనార్హం.

Trending News