Star Anise Health Benefits: స్టార్ అనైజ్ ఇది మనం బిర్యానీ మసాలాల్లో చూసే ఉంటాం. దీనని చక్ర పువ్వు అని కూడా పిలుస్తారు. ఇది వంటకు మంచి అరోమాను అందిస్తుంది. అయితే, రుచిపరంగా మాత్రమే కాదు ఇది ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు..
ఒక నివేధిక ప్రకారం స్టార్ అనైజ్ తినడం వల్ల ఇన్ల్ఫమేషన్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆర్థరైటీస్, ఆరోగ్య సమస్యలు, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది. తరచూ స్టార్ అనైజ్ నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల ఇన్ల్ఫమేషన్ తగ్గిపోతుంది.
బరువు తగ్గుతారు..
స్టార్ అనైజ్ నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల బరువు తగ్గిపోతారు. ఇది బాడీ మెటబాలిజం రేటును తగ్గిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఈ నీరు తాగుతూ హైడ్రేటేడ్ గా ఉండొచ్చు. చక్కెర తినాలనే కోరికను తగ్గిస్తుంది. అంతేకాదు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
ఇమ్యూనిటీ..
స్టార్ అనైజ్‌లో యాంటీ ఆక్సిడేంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇది ఇమ్యూనిటీ బలపరుస్తుంది. స్టార్ అనైజ్ నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
చర్మ ఆరోగ్యం..
ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.
మంచి ఆరోగ్యం..
స్టార్ అనైజ్ రెస్పరేటరీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దగ్గు, ఆస్తామాకు కూడా తగ్గిపోతుంది. రొంప సమస్యలకు చెక్ పెడుతుంది. స్టార్ అనైజ్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల మంచి డిటాక్స్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
మంచి నిద్ర..
స్టార్ అనైజ్లోని అరోమా వల్ల స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఇది మంచి నిద్రకు సహాయపడతుంది. పడుకునే ముందు ఓ గ్లాసు స్టార్ అనైజ్ నీటిని తీసుకోవడం వల్ల మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు.
ఇదీ చదవండి: కండరాల దృఢత్వానికి 8 సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసా?
పీరియడ్స్ పెయిన్..
ఇందులోని మెడిసినల్ గుణాల వల్ల మెనుస్ట్రువల్ పెయిన్ నుంచి బయటపడొచ్చు. కడుపులో అసౌకర్యం, తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. స్టార్ అనైజ్ కండరాలకు ఉపశమనాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది,
స్టార్ అనైజ్ డిటాక్స్ వాటర్ తయారీ విధానం..
మూడు స్టార్ అనైజ్ తీసుకుని ఓ లీటర్ నీటిలో వేసి ఉడికించుకోవాలి. ఓ 10 నిమిషాలపాటు సిమ్‌లో మరిగించుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత స్టార్ అనైజ్ తీసేసి ఓ బాటిల్లో పోసుకోవాలి. ఇందులో కావాలంటే నిమ్మరసం, పుదీనా, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని ఫ్రిజ్‌లో రాత్రంతా నిల్వచేసుకుని పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?
అలెర్జీ ఉన్నవారు ఈ నీటిని తీసుకోవడం వ్లల స్కిన్ ర్యాష్, దురద, వాపు వస్తుంది. అంతేకాదు ప్రెగ్నెన్సీ, పాలు ఇచ్చే తల్లు వీటిని తాగకూడదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి