Food For Diabetic Patients: డయాబెటిస్ వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ సమస్య కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమస్య బారిన పడిన వారు తీసుకోనే ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో సాధారణంగా చాలా మంది రెండు పూటలు అన్నం తీసుకుంటారు. అందులో తెల్ల బియ్యాని ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఇందులో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వైట్ రైస్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ కు దారి తీసే అవకాశం ఉంది.
డయాబెటిస్ ఉన్నవారు వైట్ రైస్‌కు బదులుగా మీరు ఇతర ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల మీ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది అనేది మనం తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్ డైబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపిక ఎందుకంటే ఇది ఫైబర్, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే క్వినోవా ఒక పూర్తి ప్రోటీన్, అంటే ఇది తొమ్మిది అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కలిగి ఉంటాయి. క్వినోవా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బార్లీ ఫైబర్, బీ విటమిన్లు, మనరల్స్తో సమృద్ధిగా ఉండే పురాతన ధాన్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఓట్స్‌లో ఫైబర్, బీ విటమిన్లు , మినరల్స్ అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రాగి డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ న్యూరోపతీ వంటి డయాబెటిస్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు డైబెటిస్ రైస్ కు బదులుగా తీసుకునే ఆహారాలను ఎంచుకునేటప్పుడు, కింది అంశాలను గుర్తుంచుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి