కేసీఆర్ జూనియర్ మోడీ అంటూ చంద్రబాబు ఎద్దేవా

ఆశ్వరాపుపేట బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Last Updated : Dec 5, 2018, 12:01 PM IST
కేసీఆర్ జూనియర్ మోడీ అంటూ చంద్రబాబు ఎద్దేవా

వరంగల్:అశ్వరావుపేట ప్రచార సభలో  చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది.. ఆయన అవసరం ఉన్నప్పుడే ప్రజల్లో తిరుగతారని.. ప్రజల అవసరాలు ఉన్నప్పుడు ఆయన కనిపించరని ..అలాంటి వ్యక్తులకు మనం ఓటు వేయాలా అని చంద్రబాబు ప్రశ్నించారు తెలంగాణ వస్తే బతులుకు బాగుపడతాయని పేదలు భావించారు..తీరా టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి ఫలాలు అన్నీ కేసీఆర్ కుటుంబానికి అందాయని ఎద్దేవ చేశారు. కేంద్రంలో మోడీ తరహా  కేసీఆర్ మాటలు తప్పితే చేతల మనిషికాదని..మోడీ,కేసీఆర్ ఇద్దరూ మాటల మాంత్రికులని విమర్శించారు. ఢిల్లీలో సీనియర్ మోడీ ఉంటే..ఇక్కడ కేసీఆర్ రూపంలో జూనియర్ మోడీ ఉన్నారని తెలిపారు.ఇక్కడ జూనియర్ ను ఓడించి.. 2019 ఎన్నికల్లో సీనియర్ మోడీని ఇంటికి పంపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతకుందామని ప్రజలుకు చంద్రబాబు పిలుపునిచ్చారు

నీళ్లు కూడా ఇవ్వలేని కేసీఆర్‌కు ఓట్లు వేయాలా ?
మిషన్ బగీరథ పేరుతో కేసీఆర్ నాకటాలు ఆడుతున్నారని.. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమందికి నీరు వచ్చిందో కేసీఆర్ చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. నీళ్లు కూడా ఇవ్వని కేసీఆర్ ఓట్లు అడగడం సిగ్గుచేటు ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. ఏపీలో ఆదాయం లేకపోయినా 10 లక్షలు ఇళ్లు కట్టాం..ఇక్కడ సగం కూడా కట్టాలేదని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రూ.5 లక్షలతో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో పోరాడింది.. ఉద్యోగాలు, నీళ్లు, నిధుల కోసం.. వాస్తవానికి కేసీఆర్ పాలనలో ఈవేవి ప్రజలకు దక్కలేదని చంద్రబాబు విమర్శించారు. లక్ష ఉద్యోగాలు అని చెప్పి కేసీఆర్ యువతకు మోసం చేశారు. మహాకూటమి అధికారంలో వచ్చిన ఏడాదిలోపే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. బంగారు బాతు లాంటి హైదరాబాద్ ను అప్పగిస్తే దివాలా తీసేలా తయారు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ ప్రతిష్ఠ మరింత పెంచుతామన్నారు. పేదలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వని కేసీఆర్ ఓట్లు అడిగే హక్కలేదని చంద్రబాబు ఎద్దేవ చేశారు

Trending News