Income Tax Benefits: సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ మినహాయింపులో కలిగే ప్రయోజనాలేంటి

Income Tax Benefits: దేశంలో ఇన్‌కంటాక్స్ అనేది అత్యంత కీలకమైంది. ఆదాయాన్ని బట్టి ట్యాక్స్ మారుతుంటుంది. అదే సమయంలో కొన్ని సేవింగ్ ప్లాన్స్‌పై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2024, 06:49 PM IST
Income Tax Benefits: సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ మినహాయింపులో కలిగే ప్రయోజనాలేంటి

Income Tax Benefits: ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ప్రకారం దేశంలో చాలా రకాల ఇన్‌కంటాక్స్ ప్రయోజనాలున్నాయి. ఇవి ఎక్కువగా సీనియర్ సిటిజన్లకు వర్తించేవిగా ఉంటాయి. ట్యాక్స్ ఫైలింగ్ సులభం చేసేందుకు ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు చాలా అంశాల్లో ట్యాక్స్ మినహాయింపులు ఇస్తుంటుంది. 

ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు మొత్తం 8 రకాలైన ట్యాక్స్ మినహాయింపులు కల్పిస్తోంది. జీవితాంతం సంపాదించిన సంపాదనపై వృద్ధాప్యంలో పనికొచ్చేవిధంగా కొన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు దాటిన వారికి చాలా రకాల ట్యాక్స్ ప్రయోజనాలు ఇస్తోంది. ఈ మినహాయింపులు ట్యాక్స్ పరిమితిపై కావచ్చు, ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో కావచ్చు స్టాండర్డ్ డిడక్షన్‌పై కావచ్చు, వడ్డీపై కావచ్చు. ఇలా వేర్వేరు రకాలుగా ఉంటుంది. 

ట్యాక్స్ మినహాయిపు లిమిట్

60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు రెండు రకాల ట్యాక్స్ పద్థతులు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, న్యూ ట్యాక్స్ రెజీమ్‌పై మినహాయింపు ఉంది. 3 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అదే సాధారణ పౌరులకు మాత్రం 2.5 లక్షల వరకే మినహాయింపు ఉంటుంది. అదే సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 5 లక్షల వరకూ మినహాయింపు లభిస్తుంది. 

హెల్త్ ఇన్సూరెన్స్‌పై డిస్కౌంట్

హెల్త్ ఇన్సూరెన్స్‌పై 25 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు సాధారణ కస్టమర్లకు వర్తిస్తుంటుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 50 వేల వరకూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై సెక్షన్ 80సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. 

స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం

స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. పెన్షన్ తీసుకునేవారికి ఇది వర్తిస్తుంది. ఫ్యామిలీ పెన్షన్ 15 వేలు తీసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుంది. 

వడ్డీపై మినహాయింపు

సీనియర్ సిటిజన్లకు వడ్డీపై అధిక మినహాయింపు లభిస్తుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 40 వేల వరకూ వడ్డీపై ట్యాక్స్ మినహాయింపు ఉంటే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఏడాదికి 50 వేల వరకూ వడ్డీపై ట్యాక్స్ ఉండదు. 

ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు

ఇన్‌కంటాక్స్ చట్టం 1961 ప్రకారం సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకమైన మినిహాయింపు ఉంది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. 

Also read: Income tax vs TDS: ఇన్‌కంటాక్స్‌కు టీడీఎస్‌కు మద్య తేడా ఏంటో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News